ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ మైదానంలోకి అడుగుపెట్టాడంటే... తన బ్యాట్ తో ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తాడో అందరికీ తెలుసు. దేశ విదేశాల్లో ఆయనకు అభిమానులు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఎప్పుడూ క్రికెట్ తో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు.

తనకు నచ్చినవి, తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. కాగా.. తాజాగా తన ముద్దుల కుమార్తెకు సంబంధించిన ఓ వీడియోని తన అభిమానులతో పంచుకున్నాడు. ఆ వీడియోలో వార్నర్ కుమార్తె క్రికెట్ ఆడుతూ కనిపించింది. కాగా... అందులోనూ ఆ చిన్నారి ఫ్రస్టేషన్ తో బ్యాట్ విసిరి కొట్టింది. దీంతో వీడియో ఫన్నీగా ఉంది. దీంతో వీడియో తెగ వైరల్ అవుతోంది.

Also Read టీ20ల్లో సత్తా: రెండో స్థానానికి ఎగబాకిన కేఎల్ రాహుల్...

నెట్స్‌లో బ్యాట్ పట్టుకుని ఐవీ క్రికెట్ ఆడుతోంది. అయితే, ఓ బంతిని కొట్టే ప్రయత్నంలో అది మిస్సయ్యింది. అంతే.. ఆ చిన్నారి కోపంతో అరుస్తూ బ్యాట్‌ను అమాంతం విసిరికొట్టింది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన వార్నర్.. ఐవీ తన భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందని కామెంట్ చేశాడు.

ఇప్పటి వరకు ఈ వీడియోను 2.66 లక్షల మందికిపైగా వీక్షించారు. నెటిజన్లు ఈ వీడియోకు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చిన్నప్పటి కోహ్లీ అని కొందరు కామెంట్ చేస్తే.. కొందరేమో ఆమెను ఇతరులతో ఎందుకు పోలుస్తారని, ఆమెకు సొంత గుర్తింపు ఉండనివ్వాలని అంటున్నారు. ఈ వీడియోను మీరూ చూడొచ్చు.