మరికొద్దిరోజుల్లో 2019 మనందరికీ వీడ్కోలు చెప్పనుంది. అయితే ఈ సంతోషాలు, దు:ఖం ఇలా ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. వీటిని సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది షేర్ చేసుకుని వుంటారు.. వారిలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఉన్నారు. ఇలాంటి వాటిలో కొన్నింటికి సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ‘‘గోల్డెన్ ట్వీట్ ఆఫ్ 2019’’ అనే పేరిట ప్రముఖుల ట్వీట్లను ఎంపిక చేసింది. 

వీటిలో 2019 ఎన్నికల ఫలితాలు ముగిసిన వెంటనే ప్రధాని నరేంద్రమోడీ చేసిన ‘సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌.. విజయీ భారత్‌’ అంటూ చేసిన ట్వీట్ జనాల్లోకి విపరీతంగా దూసుకెళ్లింది. అంతటి ప్రజాదరణ పొందిన మోడీ ట్వీట్‌ను ‘‘గోల్డెన్ ట్వీట్ ఆఫ్ 2019’’గా ట్విట్టర్ ఎంపిక చేసింది. 

Also Read:నో సెలబ్రేషన్స్... ఓన్లీ సైలెన్స్: కోహ్లీ ఔటయ్యాక ఓవరాక్షన్ చేయని కరేబీయన్లు

ఇక క్రీడా రంగంలో మాజీ టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ నిలిచింది.

‘హ్యాపీ బర్త్‌డే మహి భాయ్. నమ్మకం, గౌరవం అనే పదాలకు అర్థం చాలా కొంత మందికి మాత్రమే తెలుస్తుంది. నాకు అలాంటి ఫ్రెండ్‌షిప్ దొరికినందుకు, నీతో ఎన్నో ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మా అందరికి నువ్వొక పెద్దన్నయ్యవు. నేను గతంలో చెప్పినట్లుగా, నువ్వు ఎప్పటికీ నా కెప్టెన్‌వే’ అంటూ ట్విట్ చేయడం క్రీడాభిమానులతో పాటు నెటిజన్ల మనసు దోచింది.

Also Read:Video: విజయవాడ గ్రౌండ్ లో పాము కలకలం... క్రికెటర్లకు తప్పిన ప్రమాదం

ప్రపంచ వ్యాప్తంగా 2019లో క్రీడా విభాగంలో అత్యథిక మంది లైక్, రీట్వీట్ చేసిన ట్వీట్‌గా ఇది నిలిచింది. ఇందులో తన కెప్టెన్ పట్ల కోహ్లీకున్న గౌరవం, అభిమానం, ప్రేమ స్పష్టంగా కనిపించాయని పలువురు అభిప్రాయపడ్డారు.