T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టులో కోహ్లి ఉంటాడు.. !
T20 World Cup 2024 : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. అయితే, ప్రపంచ కప్ లో పాల్గోనే భారత జట్టులో విరాట్ కోహ్లీకి స్థానం దక్కకపోవచ్చనే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతో బీసీసీఐ పై క్రికెట్ లవర్స్ మండిపడుతున్నారు.
Virat Kohli -T20 World Cup 2024: మరో మెగా టోర్నీకి ఐసీసీ ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. టీ20 ప్రపంచకప్ 2024 క్రికెట్ టోర్నీ జూన్ 1 నుంచి 29 వరకు జరగనుంది. ఈ మెగా టోర్నమెంట్ ఈ సారి అమెరికా, వెస్టిండీస్‌లో జరుగుతుంది. ఇందులో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇటీవల 29 రోజుల టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. దీంతో భారత్ జట్టు కూర్పుపై పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా స్టార్ ప్లేయర్, రన్ మిషన్ విరాట్ కోహ్లీని ఈ ప్రపంచకప్ భారత జట్టు నుంచి తప్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. వెస్టిండీస్ పిచ్ లు స్లోగా ఉంటాయనీ, విరాట్ ఆటకు అనుకూలంగా ఉండవనీ, టీ20ల్లో యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించేందుకు విరాట్ కోహ్లీని భారత జట్టు నుంచి తప్పించే అవకాశం ఉందని వార్తలు సంచలనం రేపుతున్నాయి. అయితే, ఇలాంటి నిర్ణయం బీసీసీఐ తీసుకుంటే పెద్దతప్పు చేసినట్టేనని నెటిజన్లు పేర్కొంటున్నారు. గతేడాది జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ గా ఉన్న విరాట్ ను ఎలా తప్పిస్తారని క్రికెట్ లవర్స్ ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఇంగ్లాండ్ స్టార్ బౌలర్, మాజీ కెప్టెన్ స్టువర్ట్ బ్రాడ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Ranji Trophy 2024: సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన సర్బరాజ్ ఖాన్ సోదరుడు
విరాట్ కోహ్లీ పై వస్తున్న ఇలాంటి వార్తలు నిజం కావనీ, అతను ఖచ్చితంగా టీ20 ప్రపంచ కప్ 2024కు ఎంపిక అవుతాడని తాను విశ్వసిస్తున్నట్లు స్టువర్ట్ బ్రాడ్ ఎక్స్ లో పేర్కొన్నాడు. "ఈ వార్త నిజం కాకపోవచ్చు. అభిమానుల దృష్టిలో ఆటను పెంచేందుకు ఐసీసీ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ను అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్వహిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ ప్రపంచంలోని ఏ ఆటగాడి కంటే తక్కువ కాదు. కాబట్టి అతను ప్రపంచకప్‌కు ఎంపిక అవుతాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని" పేర్కొన్నాడు.