Musheer Khan breaks Sachin Tendulkar's record : భారత ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ పరుగుల వరద పారిస్తున్నాడు. ముంబై vs విదర్భ రంజీ ట్రోఫీ 2024 ఫైనల్ మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలోనే భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.  

Musheer Khan-Sachin Tendulkar: స‌ర్ఫరాజ్ ఖాన్ సోద‌రుడు ముషీర్ ఖాన్ సూప‌ర్ ఇన్నింగ్స్ తో ముంబై టీమ్ ను విజ‌యం దిశ‌గా ముందుకు న‌డిపించాడు. రంజీ ట్రోపీ 2024 సీజ‌న్ ప్రారంభం నుంచి అద‌ర‌గొడుతున్న ఈ యంగ్ ప్లేయ‌ర్ ముంబై vs విదర్భ రంజీ ట్రోఫీ 2024 ఫైనల్ మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలోనే భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో నిరాశ‌ప‌ర్చినా రెండో ఇన్నింగ్స్ లో సెంచ‌రీ కొట్టాడు.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై-విదర్భ జట్ల మధ్య 89వ రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 224 పరుగులు చేయగా, విదర్భ 105 పరుగులు చేసింది. 119 పరుగుల ఆధిక్యంతో 2వ ఇన్నింగ్స్ ఆడిన ముంబై జట్టు 130.2 ఓవర్లలో 418 పరుగులకు ఆలౌటైంది. తద్వారా విదర్భ జట్టుకు 538 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ముంబై జట్టులో ముషీర్ ఖాన్ 136 పరుగులు చేశాడు. త‌న ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు బాదాడు. విదర్భ జట్టులో హర్ష్ దూబే 5 వికెట్లు, యశ్ ఠాకూర్ 3 వికెట్లు తీశారు. ఆ తర్వాత 2వ ఇన్నింగ్స్ ఆడిన విదర్భ జట్టు 3వ రోజు ఆట ముగిసే సమయానికి 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది.

హార్దిక్ పాండ్యాకు అంత ఈజీ కాదు.. 

ప్ర‌స్తుతం మ్యాచ్ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే బలమైన ముంబై జట్టు 42వ సారి రంజీ ట్రోఫీని గెలుచుకోవడం దాదాపు ఖాయమ‌నే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా సర్బరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ దిగ్గ‌జ ప్లేయ‌ర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చ‌రిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల ముషీర్ ఖాన్ సచిన్ టెండూల్కర్‌ను అధిగ‌మించి రంజీ క్రికెట్ ఫైనల్‌లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడైన ముంబై ప్లేయర్‌గా నిలిచాడు. 1994-95 రంజీ ఫైనల్‌లో పంజాబ్‌పై టెండూల్కర్ 21 ఏళ్ల 11 నెలల మ‌య‌స్సులో సెంచరీ సాధించాడు.

Scroll to load tweet…

WPL 2024: ఎల్లిస్ పెర్రీ అద్భుత బౌలింగ్.. ముంబైని చిత్తుచేసిన బెంగ‌ళూరు !