వెల్లింగ్టన్: మూడు ఫార్మాట్లలోనూ తీరిక లేకుండా ఆడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ ఫార్మాట్ నుంచి తప్పుకునే విషయంపై మాట్లాడాడు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 84 టెస్టులు, 248 వన్డే ఇంటర్నేషనల్స్, 82 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. 

31 ఏళ్ల వయస్సు గల విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కొనసాగడంపై తన మనసులోని మాటను చెప్పాడు. మరో మూడేళ్ల పాటు టెస్టులు, వన్డేలు, టీ20లు ఆడుతానని, ఆ తర్వాత వర్క్ లోడ్ గురించి తిరిగి సమీక్షించుకోవచ్చునని, ట్రాన్సిషన్ ఫేజ్ వస్తుందని ఆయన అన్నాడు. మరో మూడేళ్ల తర్వాత మూడు ఫార్మాట్లలో ఓ ఫార్మాట్ నుంచి తప్పుకోవచ్చునని ఆయన అన్నాడు.

Also Read: కోహ్లీని ఔట్ చేసి సత్తాను పరీక్షించుకుంటా: ట్రెంట్ బౌల్ట్

గత 8 ఏళ్లుగా ఏడాదికి 300 రోజులు ఆడుతున్నానని, ఇందులో ప్రయాణాలూ ప్రాక్టీస్ సెషన్ లు కూడా ఉన్నాయని, ఇది తీవ్రమైన ప్రభావం చూపుతాయని, అయితే ఆటగాళ్లు దాని గురించి ఆలోచించడం లేదని కాదని, తీరికలేని షెడ్యూల్ లో కూడా వ్యక్తిగతంగా తాము విరామం తీసుకుంటున్నామని ఆయన అన్నాడు. ముఖ్యంగా అన్నిఫార్మాట్లలో ఆడేవాళ్లం అలా విరామం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపాడు.

అయితే, కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించడం అం తేలికైన విషయం కాదని, ప్రాక్టీస్ సెషన్ లో కూడా దీని ప్రభావం ఉంటుందని, అయితే విరామం తీసుకుంటూ దాన్ని అధిగమిస్తున్నామని చెప్పాడు. 

34-35 ఏళ్ల వయస్సులో తన శరీరం అంత పనిభారాన్ని మోయలేదని, కానీ వచ్చే రెండు మూడేళ్ల వరకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవని అన్నాడు. వచ్చే మూడేళ్ల వరకు జట్టుకు తన సహాయం ెంతో అవసరమని ఆయన అన్నాడు. ఆ తర్వాతే తాను ఎటువంటి నిర్ణయమైనా తీసుకుంటానని చెప్పాడు

Also Read: బుమ్రాకు ఇక ఈజీ కాదు: కివీస్ బ్యాట్స్ మెన్ నేర్పిన పాఠం ఇదే..

ఐసీసీ నిర్వహించే అన్ని టోర్నమెంట్లలో టెస్టు చాంపియన్ షిప్ తన దృష్టిలో అత్యున్నతమైందని, అందకే అన్ని జట్లు లార్డ్స్ లో జరిగే ఫైనల్స్ లో ఆడాలని చూస్తాయని, ఇతరులకు తాము భిన్నమేమీ కాదని, ఫైనల్స్ లో ఆడాలని తాను ఆశిస్తున్నానని విరాట్ కోహ్లీ చెప్పాడు.