వెల్లింగ్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ తీసి తన సత్తాను చాటుకుంటానని న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అన్నాడు. ఈ నెల 21 నుంచి న్యూజిలాండ్ భారత్ తో తొలి టెస్టు మ్యాచులో తలపడడానికి సిద్ధపడుతున్న విషయం తెలిసిందే. 

భారత్ పై జరిగే రెండు టెస్టు మ్యాచుల్లో ఆడడానికి న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ సిద్ధమయ్యాడు. విరాట్ కోహ్లీకి సవాల్ విసరడం ద్వారా తన సత్తాను రీఎంట్రీలో చాటుకోవాలని చూస్తున్నాడు. గాయం కారణంగా గత ఆరు వారాలుగా అతను క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. 

Also Read: టెస్టు జట్టులోకి పంత్ రీఎంట్రీ... అంతా పిచ్ మహిమేనా?

విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లను అవుట్ చేయడం ద్వారా తన సత్తాను పరీక్షించుకోవాలని చూస్తున్నానని, అందుకే మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్నానని ఆయన అన్నాడు. 

విరాట్ కోహ్లీ అసాధారణమైన ఆటగాడనే విషయం అందరికీ తెలుసునని ఆయన అన్నాడు. ఇండియా బలంగా ఉందని, ఏ విధంగా ఆడాలనే విషయంపై వారికి పూర్తి స్పష్టత ఉందని ఆయన అన్నాడు. 

Also Read: బుమ్రాకు ఇక ఈజీ కాదు: కివీస్ బ్యాట్స్ మెన్ నేర్పిన పాఠం ఇదే..

టెస్టు మ్యాచుకు పూర్తి సిద్ధమయ్యాయని, ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో మ్యాచు ఆడుతుండడం తనకు ఎంతో బాగుందని, ఈ వారం ఉద్వేగంగా గడుసుతుందని ఆయన అన్నాడు.