కటక్: వెస్టిండీస్ పై కటక్ లో జరిగిన మూడో వన్డేలో శార్జూల్ ఠాకూర్ చేసిన బ్యాటింగ్ కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మురిసిపోయాడు. శార్దూల్ ఠాకూర్ ను ఆయన అభినందించారు. వెస్టిండీస్ నిర్దేశించిన 316 పరుగుల లక్ష్యాన్ని భారత్ 48.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించిన విషయం తెలిసిదే. తద్వారా ఈ ఏడాదికి టీమిండియా విజయంతో వీడ్కోలు పలికింది. 

తప్పకుండా విజయం సాధించాల్సిన ఈ మ్యాచులో కేఎల్ రాహుల్ 89 బంతుల్లో 77 పరుగులు చేయగా,  రోహిత్ శర్మ 63 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 81 బంతుల్లో 85 పరుగులు చేసి మ్యాచ్ చేజారకుండా చూశాడు. 

22 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

చివరలో విరాట్ కోహ్లీ అవుట్ కావడంతో భారత శిబిరంలో తీవ్ర నిరాశ చోటు చేసుకుంది. ఈ సమయంలో ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ చేసిన బ్యాటింగ్ తో ఇండియా సునాయసంగా గట్టెక్కింది. ఇండియా మ్యాచ్ ను కోల్పోతుందని అనుకున్న సమయంలో బ్యాటింగ్ కు దిగిన శార్దూల్ మ్యాచ్ ను ఏకపక్షంగా మార్చేశాడు. జడేజాతో కలిసి అతను ఇండియాను విజయ తీరానికి చేర్చాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Tula maanla re Thakur 👏😎😄 @shardul_thakur

A post shared by Virat Kohli (@virat.kohli) on Dec 22, 2019 at 6:08pm PST

మ్యాచ్ తర్వాత జడేజా, శార్దూల్ ఠాకూర్ లు మైదానంలో కలిసిన సమయంలో వారిని కోహ్లీ అభినందించారు. భుజంపై పదే పదే చేతితో తడుతూ శార్దూల్ ఠాకూర్ ను ఆయన ప్రశంసించాడు. ఆ తర్వాత తన ట్విట్టర్ ఖాతాలో శార్దూల్ కు మరాఠీ భాషలో హ్యాట్సాఫ్ చెప్పాడు. 

కాజల్‌కు మిథాలిరాజ్ ఛాలేంజ్.. ఒకే చెప్పిన క్విన్ బ్యూటీ

తులా మన్లా రే ఠాకూర్ (హ్యాట్యాఫ్ ఠాకూర్) అంటూ ట్విట్టర్ లో కోహ్లీ శార్దూల్ ను పొగిడాడు. శార్దూల్ ను కోహ్లీ అభినందించడంతో నెటిజన్లు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తన చివరి శ్వాస వరకు ఠాకూర్ కు తాను అభిమానిగా ఉంటానని ఒకతను ట్వీట్ చేశాడు.