కటక్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో రికార్డును బ్రేక్ చేశాడు. కటక్ లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచులో 63 పరుగులు చేసిన రోహిత్ శర్మ అత్యంత అరుదైన రికార్దును సొంతం చేసుకున్నాడు. అతను 22 ఏళ్లనాటి రికార్డును బద్దలు కొట్టాడు.

ఓపెనర్ గా ఓ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును సృష్టించాడు. తద్వారా శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య రికార్డును బ్రేక్ చేశాడు. జయసూర్య 1997లో 2,387 పరుగులు చేశాడు. 

టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 2008లో 2,355 పరుగులు చేసి ఈ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ 2442 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, జయసూర్య రెండో స్థానంలో నిలిచాడు. 

రోహిత్ శర్మ ఈ క్యాలెండర్ ఇయర్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10 సెంచరీ చేశాడు. అంతే మేరకు అర్థ సెంచరీలు చేశాడు. వెస్టిండీస్ పై ఇండియా మూడో వన్డే మ్యాచులో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.