MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • Cricket
  • Vaibhav Sooryavanshi : ధోనీలాగే వైభవ్ కూడా లీటర్లకొద్ది పాలు తాగుతాడా..?

Vaibhav Sooryavanshi : ధోనీలాగే వైభవ్ కూడా లీటర్లకొద్ది పాలు తాగుతాడా..?

మహేంద్ర సింగ్ ధోని పాలు బాాగా తాగుతాడని అందరికీ తెలిసిందే… ఈ విషయాన్ని స్వయంగా అతడే చెప్పాడు. మరి సేమ్ ధోనీలాగే హిట్టింగ్ క్రికెట్ ఆడే వైభవ్ సూర్యవంశీ కూడా పాలు తాగుతాడా..?  

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 01 2026, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వైభవ్ రికార్డుల మోత
Image Credit : ANI

వైభవ్ రికార్డుల మోత

Vaibhav Sooryavanshi : చిన్న వయసులో పాలు తాగితే శారీరక, మానసిక ఎదుగుదల బాగుంటుంది. ముఖ్యంగా క్రీడలపై ఆసక్తి చూపించే చిన్నారులు పాలు తాగడం వల్ల ఎముకలు గట్టిపడటం, కండరాలు బలంగా మారతాయి... ఇది వారి క్రీడా జీవింతంలో ఎంతగానో ఉపయోగడతాయి. అందుకే కొందరు క్రీడాకారులు ఇప్పటికీ ఎక్కువగా పాలు తాగుతుంటారు. టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ రోజుకు లీటర్ పాలు తాగుతాడట. బయట మాత్రం అతడు రోజుకు ఐదు లీటర్ల పాలు తాగుతాడు.. అందుకే అంత స్ట్రాంగ్ గా ఉంటాడనే ప్రచారం జరుగుతుంది.

అయితే మహేంద్ర సింగ్ ధనాధన్ బ్యాటింగ్ ను మరిపించేలా వైభవ్ సూర్యవంశీ హిట్టింగ్ ఉంటోంది. 15 ఏళ్ళ ఈ కుర్రాడు ఐపిఎల్ 2026 లో అదరగొట్టాడు... వరల్డ్ క్లాస్ బౌలర్లను చితక్కొట్టాడు. ఇక యంగ్ బౌలర్ల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం... వైభవ్ దెబ్బకు విలవిల్లాడిపోయారు. అతడు బంతిని బాదేందుకు ఉపయోగించే బలం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో ధోనీలా పాలు ఎక్కువగా తాగుతాడా..? అనుమానం చాలామందికి వచ్చివుంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
వైభవ్ పాలు తాగుతాడా..?
Image Credit : ANI

వైభవ్ పాలు తాగుతాడా..?

మే 31 (ఆదివారం) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య ఐపీఎల్ 2026 ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్‌కు వైభవ్ సూర్యవంశీ హాజరయ్యాడు. ఈ సీజన్ లో అత్యధిక పరుగులు సాధించిన వైభవ్ ఆరెంజ్ క్యాప్ సాధించాడు. అంతేకాదు రాజస్థాన్ రాయల్స్ తరపున అద్భుతంగా ఆడిన ఇతడిని మరెన్నో అవార్డులు వరించాయి. వీటిని అందుకునేందుకే వైభవ్ ప్రత్యేకంగా ఫైనల్ మ్యాచ్ కు హాజరయ్యాడు.

అయితే ఈ అవార్డులు అందుకున్న వైభవ్ సూర్యవంశీని భారత మాజీ కెప్టెన్, కామెంటేటర్ రవిశాస్త్రి ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో వైభవ్ ను సరదా ప్రశ్నలు కూడా అడిగారు.. వీటికి అతడు చెప్పిన ఆన్సర్స్ స్టేడియంలోని అభిమానులే కాదు అందరినీ ఆకర్షించాయి. ప్రజెంటేషన్ సెర్మనీలో రవిశాస్త్రి సరదాగా.. ''బౌలర్లు ఎవ్వరినీ వదిలిపెట్టకుండా కొడుతున్నావు. ఇంత బలంగా ఉండటానికి రోజూ ఎన్ని పాలు తాగుతావు'' అని అడిగారు.

ఈ ప్రశ్నకు వైభవ్ చిరునవ్వుతోనే ప్రొఫెషనల్‌గా సమాధానమిచ్చాడు. ''తాను ఇప్పుడు పాలు తాగడం లేదు'' అని చెప్పడంతో రవిశాస్త్రితో పాటు అక్కడున్న వారంతా నవ్వేశారు. ''పాలు తాగడానికి ఇంకా తాను చిన్న పిల్లాడిని కాదు... ఈ ఐపిఎల్ లో సాధించిన పరుగులే తాను ఎంత ఎదిగానో చెబుతాయి'' అనేలా అతడి సమాధానం ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. వైభవ్ పాలు తాగను అని చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Funny conversations between Ravi Shastri and Vaibhav Suryavanshi 😂✨ pic.twitter.com/FmY2TpPr5g

— Shin Kohli (@Shinkohli) May 31, 2026

33
ఐపిఎల్ 2026 లో వైభవ్ సాధించిన అవార్డులు..
Image Credit : X/@StarSportsIndia

ఐపిఎల్ 2026 లో వైభవ్ సాధించిన అవార్డులు..

రాజస్థాన్ రాయల్స్ (RR) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, తన రెండో ఐపీఎల్ సీజన్‌ను రికార్డుల మోతతో ముగించాడు. తన బ్యాటింగ్ పవర్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ చిన్న వయసులోనే వైభవ్ కనబరిచిన నిలకడ, అతని స్ట్రైక్ రేట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ ప్రపంచ క్రికెట్‌లో ఒక మేటి ఆటగాడిగా ఎదుగుతున్నాడు. ఒక ప్రామిసింగ్ యంగ్‌స్టర్ స్థాయి నుంచి మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే స్టార్‌గా మారిపోయాడు. ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లలో 48.50 సగటుతో, 237.30 స్ట్రైక్ రేట్‌తో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీ సాధించాడు. మొత్తంగా ఈ సీజన్లో 776 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న వైభవ్ ఐపీఎల్ 2026 లో ఏకంగా ఐదు ప్రధాన అవార్డులను కైవసం చేసుకున్నాడు. అత్యధిక పరుగుల ఆరెంజ్ క్యాప్ తో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్, మోస్ట్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ అవార్డులను గెలుచుకున్నాడు. ఈ అవార్డులతో పాటు అతనికి రూ.55 లక్షల ప్రైజ్ మనీ, సరికొత్త టాటా సియెర్రా కారు కూడా బహుమతిగా లభించాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image2
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image3
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
Now Playing
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ | Vaibhav Suryavanshi Creates IPL History | Asianet News Telugu
Recommended image2
Vaibhav Sooryavanshi :100 మిస్సైతేనేంరా బుడ్డోడా, 1000 కొట్టేశావుగా : శతకం కాదు వైభవ శకమే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved