దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన  నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా మాజీ కెప్టెన్ ధోనీ క్రికెట్ భవిష్యత్తు గురించి బీసీసీఐ కొత్త సారథి గంగూలీ తనతో ఏమీ మాట్లాడలేదని తెలిపాడు.

ఈ నేపథ్యంలో గంగూలీకి కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు. దాదా బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం గొప్పగా ఉందని.. బీసీసీఐ అధినేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనతో టచ్‌లో ఉంటారని కోహ్లీ పేర్కొన్నాడు.

తాను ముందుగానే గంగూలీని కలుస్తానని.. కాకపోతపే ఇప్పటి వరకు మహీ గురించి కానీ జట్టు గురించి కానీ దాదా తనతో మాట్లాడలేదని విరాట్ మీడియాకు తెలిపాడు. అక్టోబర్ 24న బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో ఉండబోతున్న గంగూలీని తాను కలుస్తానన్నాడు.

Also Read: Ranchi Test: టెస్టు సిరీస్‌లో భారత్ క్లీన్‌స్వీప్.. సఫారీలపై సూపర్ విక్టరీ

అధ్యక్షుడితో టీమిండియా కెప్టెన్‌గా ఏం మాట్లాడాలో అప్పుడే మాట్లాడుతానన్నాడు. రాంచీలో మ్యాచ్ జరిగింది కదా.. ధోనీ ఇంటికి వెళతారా అని ప్రశ్నించగా ... ఈ రోజు ఆటలో ధోనినే ఇక్కడకు వచ్చి కలిశాడు కదా అంటూ నవ్వుతూ బదులిచ్చాడు.

కాగా.. దక్షిణాఫ్రికాను వైట్ వాష్ చేసిన అనంతరం మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని జట్టు సభ్యులను కలిశాడు. డ్రస్సింగ్ రూమ్‌లో కోహ్లీ, రవిశాస్త్రితో పాటు జట్టు సభ్యులను కలిశాడు. రాంచీలో మ్యాచ్ జరుగుతుండటంతో ధోనీ వస్తాడని అంతా ఊహించారు.

అయితే తొలి మూడు రోజులు మహీ మైదానానికి రాలేదు. నాలుగో రోజు భారత్ విజయం సాధించిన తర్వాత ధోనీ అక్కడిక చేరుకున్నాడు. దీనిపై కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ.. అత్యద్భుత సిరీస్ విజయం తర్వాత తన సొంత నగరంలో టీమిండియా దిగ్గజాన్ని చూడటం ఎంతో బాగుందని రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. 

రాంచి టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. సఫారీలపై ఘనవిజయం సాధించి  భారత్ గడ్డపై టెస్టుల్లో తమకి తిరుగులేదని  మరోసారి నిరూపించుకుంది. 202 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై భారత్  గెలుపొందింది. దీంతో  3-0తో సిరీస్‌ని క్లీన్ స్విప్ చేసింది.

Also Read: రూ.కోట్లలో జీతం నిద్రపోవడానికేనా..? రవిశాస్త్రిపై నెటిజన్ల సీరియస్

విశాఖలో జరిగిన తొలి టెస్టులో 203 పరుగుల తేడాతో గెలిచిన భారత్ ఆ తర్వాత పుణె టెస్టులోను , 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజాగా రాంచీ టెస్ట్‌లోను  తన సత్తా చాటి మరో సారి సొంత గడ్డపై తిరుగులేదని నిరూపించుకుంది.

ఓవర్‌నైట్‌ స్కోరు 132/8తో  నాలుగోరోజు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సఫారీలురెండు ఓవర్లలోనే ఆలౌటయ్యారు. భారత బౌలర్ నదీమ్‌ రెండు వికెట్లు పడగొట్టడంతో  రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే దక్షిణాఫ్రికా కుప్పకూలిపోయింది .