Asianet News TeluguAsianet News Telugu

రూ.కోట్లలో జీతం నిద్రపోవడానికేనా..? రవిశాస్త్రిపై నెటిజన్ల సీరియస్

కోట్ల రూపాయల జీతం తీసుకొని రవిశాస్త్రి మైదానంలో నిద్రపోతున్నాడని పలువురు మండిపడుతున్నారు. ప్రపంచంలో కెల్లా అత్యుత్తమ ఉద్యోగం రవిశాస్త్రి దిఅంటూ విమర్శిస్తున్నారు. మరొకరేమో నిద్రపోవడానికే రూ.10కోట్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు.
 

Ravi Shastri Sleeping During India-South Africa Match is the Internet's New Favourite Meme
Author
Hyderabad, First Published Oct 22, 2019, 12:37 PM IST

రాంచీ వేదికగా.. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన ఎదురైంది. అందరూ ఆసక్తిగా మ్యాచ్ తిలకిస్తుంటే.... టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి మాత్రం స్టేడియంలోనే కూర్చొని నిద్రపోయాడు. చక్కగా... వెనక్కి వాలి ఓ కునుకు తీశాడు. రవిశాస్త్రి వెనక ఉన్న శుబ్ మన్, గిల్ కోచ్ లు మాత్రం ఆసక్తిగా మ్యాచ్ తిలకిస్తుండటం విశేషం.

రవిశాస్త్రి హాయిగా కునుకు తీస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు ట్వీట్ల రూపంలో రవిశాస్త్రి ని ఆడేసుకుంటున్నారు. తమదైన శైలిలో కామెంట్స్ చేస్తూ... ఈ ఫోటోపై స్పందిస్తున్నారు. ఈ మ్యాచ్ లో భారత్ గెలుపు ఖాయమనే ధీమాతో రవి శాస్త్రి నిద్రపోతున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం అతని నిర్లక్ష్యాన్ని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

కోట్ల రూపాయల జీతం తీసుకొని రవిశాస్త్రి మైదానంలో నిద్రపోతున్నాడని పలువురు మండిపడుతున్నారు. ప్రపంచంలో కెల్లా అత్యుత్తమ ఉద్యోగం రవిశాస్త్రి దిఅంటూ విమర్శిస్తున్నారు. మరొకరేమో నిద్రపోవడానికే రూ.10కోట్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా... రాంచి టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. సఫారీలపై ఘనవిజయం సాధించి  భారత్ గడ్డపై టెస్టుల్లో తమకి తిరుగులేదని  మరోసారి నిరూపించుకుంది. 202 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై భారత్  గెలుపొందింది. దీంతో  3-0తో సిరీస్‌ని క్లీన్ స్విప్ చేసింది.

విశాఖలో జరిగిన తొలి టెస్టులో 203 పరుగుల తేడాతో గెలిచిన భారత్ ఆ తర్వాత పుణె టెస్టులోను , 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజాగా రాంచీ టెస్ట్‌లోను  తన సత్తా చాటి మరో సారి సొంత గడ్డపై తిరుగులేదని నిరూపించుకుంది.

ఓవర్‌నైట్‌ స్కోరు 132/8తో  నాలుగోరోజు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సఫారీలురెండు ఓవర్లలోనే ఆలౌటయ్యారు. భారత బౌలర్ నదీమ్‌ రెండు వికెట్లు పడగొట్టడంతో  రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే దక్షిణాఫ్రికా కుప్పకూలిపోయింది .

నోర్జెతో కలిసి బ్యాటింగ్ దిగిన  డిబ్రుయిన్‌ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఇన్నింగ్స్‌ లోని రెండో ఓవర్‌లో నదీమ్‌ బౌలింగ్‌లో కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఎంగిడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.

తొలి బంతినే అతడు షాట్‌ ఆడాలని  ప్రయత్నించి ఔటయ్యాడు. అతను కొట్టిన షాట్  బంతి నేరుగా వెళ్లి అవతల ఎండ్‌లో ఉన్న నోర్జెకి  తగిలింది. దీంతో ఆ బంతి గాల్లోకి ఎగిరడంతో దాన్ని నదీమ్‌  క్యాచ్‌ పట్టడంతో సఫారీల  కథ ముగిసిపోయింది.సఫారీలతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసి నయా రికాడ్డును సృష్టించింది. ఈ  సిరీస్‌ గెలుపుతో టెస్ట్‌ల్లో తనుకుతిరుగులేదని నిరూపించుకుంది. టెస్టు ఫార్మాట్‌లో  టీమిండియాపై  దక్షిణాఫ్రికాదే పైచేయి ఉండగా  స్వదేశంలో జరిగే టెస్టుల్లో మాత్రం టీమిండియాదే పైచేయి..  

Follow Us:
Download App:
  • android
  • ios