రాంచి టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. సఫారీలపై ఘనవిజయం సాధించి  భారత్ గడ్డపై టెస్టుల్లో తమకి తిరుగులేదని  మరోసారి నిరూపించుకుంది. 202 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై భారత్  గెలుపొందింది. దీంతో  3-0తో సిరీస్‌ని క్లీన్ స్విప్ చేసింది.

విశాఖలో జరిగిన తొలి టెస్టులో 203 పరుగుల తేడాతో గెలిచిన భారత్ ఆ తర్వాత పుణె టెస్టులోను , 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజాగా రాంచీ టెస్ట్‌లోను  తన సత్తా చాటి మరో సారి సొంత గడ్డపై తిరుగులేదని నిరూపించుకుంది.


ఓవర్‌నైట్‌ స్కోరు 132/8తో  నాలుగోరోజు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సఫారీలురెండు ఓవర్లలోనే ఆలౌటయ్యారు. భారత బౌలర్ నదీమ్‌ రెండు వికెట్లు పడగొట్టడంతో  రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే దక్షిణాఫ్రికా కుప్పకూలిపోయింది .

అజారుద్దీన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

నోర్జెతో కలిసి బ్యాటింగ్ దిగిన  డిబ్రుయిన్‌ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఇన్నింగ్స్‌ లోని రెండో ఓవర్‌లో నదీమ్‌ బౌలింగ్‌లో కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఎంగిడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.

తొలి బంతినే అతడు షాట్‌ ఆడాలని  ప్రయత్నించి ఔటయ్యాడు. అతను కొట్టిన షాట్  బంతి నేరుగా వెళ్లి అవతల ఎండ్‌లో ఉన్న నోర్జెకి  తగిలింది. దీంతో ఆ బంతి గాల్లోకి ఎగిరడంతో దాన్ని నదీమ్‌  క్యాచ్‌ పట్టడంతో సఫారీల  కథ ముగిసిపోయింది.

ధోని ఆడగా లేనిది.. నా భర్త ఆడకూడదా: అభిమానులపై సర్ఫరాజ్‌ భార్య ఫైర్

సఫారీలతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసి నయా రికాడ్డును సృష్టించింది. ఈ  సిరీస్‌ గెలుపుతో టెస్ట్‌ల్లో తనుకుతిరుగులేదని నిరూపించుకుంది. టెస్టు ఫార్మాట్‌లో  టీమిండియాపై  దక్షిణాఫ్రికాదే పైచేయి ఉండగా  స్వదేశంలో జరిగే టెస్టుల్లో మాత్రం టీమిండియాదే పైచేయి..  

స్వదేశంలో భారత్‌, సఫారీలతో అడిగిన  టెస్ట్ మ్యాచ్‌లలో  ఒక్క సిరీస్‌ మినహ అన్నింటిని భారత్ గెలుచుకుంది. అయితే దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌ ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా  గెలవలేదు.  ఇనాళ్ళు భారత్‌కు  సఫారీలు  కొరకరాని కొయ్యగానే ఉన్నారు.

ఈ సిరీస్‌ ముందు వరకూ దక్షిణాఫ్రికాపై ఏ టెస్టు సిరీస్‌ను కూడా భారత్ క్లీన్ స్వీప్ చేయలేకపోయింది. ఈ గెలుపుతో లోటు కూడా తీరింది .