Asianet News TeluguAsianet News Telugu

క‌న్నీళ్లు పెట్టుకున్న విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా.. వీడియో

Virat Kohli, Hardik Pandya In Tears : టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ఫైన‌ల్ లో దక్షిణాఫ్రికాపై భార‌త్ గెలుపులో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు కీల‌క పాత్ర పోషించారు. కింగ్ కోహ్లీ 76 ప‌రుగులు ఇన్నింగ్స్ ఆడ‌గా, హార్దిక్ పాండ్యా కీల‌క‌మైన 3 వికెట్లు తీసుకున్నారు. 
 

Virat Kohli, Hardik Pandya In Tears After India Win T20 World Cup 2024 Title Beating South Africa RMA
Author
First Published Jun 30, 2024, 6:53 PM IST

Virat Kohli, Hardik Pandya In Tears: వెస్టిండీస్ లోని బార్బడోస్ వేదిక‌గా శనివారం జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ఛాంపియ‌న్ గా నిలిచింది. టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ఫైన‌ల్ లో దక్షిణాఫ్రికాపై భార‌త్ గెలుపులో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు కీల‌క పాత్ర పోషించారు. కింగ్ కోహ్లీ 76 ప‌రుగులు ఇన్నింగ్స్ ఆడ‌గా, హార్దిక్ పాండ్యా కీల‌క‌మైన 3 వికెట్లు తీసుకున్నారు. అయితే, ఈ గెలుపు త‌ర్వాత విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా కన్నీళ్లు పెట్టుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ ల మంచి ఇన్నింగ్స్ ల‌తో 176/7 ప‌రుగులు చేసింది. టార్గెట్ ఛేద‌న‌లో హెన్రిచ్ క్లాసెన్‌ను ఔట్ చేయ‌డంతో ద‌క్షిణాఫ్రికా 169/8 ప‌రుగుల‌కే పరిమితం అయింది. దీంతో భార‌త్ ఒక్క ఓట‌మి లేకుండా టీ20 ప్ర‌పంచ క‌ప్ ట్రోఫీని అందుకుని చ‌రిత్ర సృష్టించింది.

 

 

 

2007లో దక్షిణాఫ్రికాలో దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని నాయకత్వంలో గెలిచిన తర్వాత, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత భారత్‌కు ఇది రెండో టీ20 ప్రపంచకప్ విజయం. 17 ఏళ్ల క్రితం కాబోయే దిగ్గ‌జ క్రికెటర్ అని గుర్తింపు తెచ్చుకుంటున్న విరాట్ కోహ్లీ అందుకుత‌గ్గట్టుగానే త‌న ప్ర‌యాణం కొన‌సాగించారు. టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ఫైన‌ల్ లో అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో భార‌త జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు. ఫైనల్‌లో కింగ్ కోహ్లీ 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్‌లతో 76 పరుగులు చేశాడు. అక్ష‌ర్ ప‌టేల్ కూడా 47 ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు.

ఇక బౌలింగ్ లో అర్ష్‌దీప్ సింగ్ (2/20), జస్ప్రీత్ బుమ్రా (2/18), హార్దిక్ పాండ్యా (3 వికెట్లు) అద‌ర‌గొట్ట‌డంతో టీమిండియా విజ‌యాన్ని అందుకుంది. హెన్రిచ్ క్లాసెన్ 27 బంతుల్లో 52 (2×4, 5×6)తో భారత్‌ను భ‌య‌పెట్టాడు కానీ, కీల‌క స‌మ‌యంలో ఔట్ కావ‌డంతో సౌతాఫ్రికాకు ఓట‌మి త‌ప్ప‌లేదు. హార్దిక్ పాండ్యా (3/20) కీలక వికెట్ల‌ను తీసుకుని మ్యాచ్ ను భారత్‌కు అనుకూలంగా తీసుకువ‌చ్చాడు. అయితే, ఈ మ్యాచ్ లో పెద్ద క్రెడిట్ కోహ్లీకే చెందుతుంది. ఎందుకంటే కీల‌క‌మైన రోహిత్ శర్మ (9), రిషబ్ పంత్ (0), సూర్యకుమార్ యాదవ్ (3)లు 34 ప‌రుగుల‌తో ఔట్ అయిన త‌ర్వాత అక్ష‌ర్ ప‌టేల్, శివ‌మ్ దుబేల‌తో క‌లిసి భార‌త ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్దాడు కోహ్లీ.

క‌రెక్ట్ టైమ్ లో క‌రెక్ట్ డిసీషన్.. రోహిత్ శ‌ర్మ నిజంగా నువ్వు గ్రేట్ బాసు !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios