టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్యను కొందరు టార్గెట్ చేయడం పై సీరియస్ అయ్యాడు. ప్రతీ ఒక్కరికి తన భార్య అనుష్క శర్మ ఈజీ టార్గెట్ గా మారిందని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆవేదన వ్యక్తం చేసాడు. 

వరల్డ్‌కప్‌ సమయంలో అనుష్కకు ఓ సెలెక్టర్‌ టీ అందించాడంటూ మాజీ ఆటగాడు ఫరూఖ్‌ ఇంజనీర్‌ చేసిన వ్యాఖ్యలు మనందరికీ తెలిసిందే. దీనిపై కోహ్లీ స్పందించాడు. 

శ్రీలంకతో జరిగిన ప్రపంచకప్‌ మ్యాచ్‌ను చూసేందుకు అనుష్క శర్మ స్టేడియానికి వచ్చిందిని, ఆ రోజు అనుష్క శర్మ సెలెక్టర్ల బాక్స్ లో కూర్చోలేదని విరాట్ కోహ్లీ తెలిపాడు. 

అనుష్క శర్మ సెలెక్టర్ల బాక్స్‌లో కాకుండా ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి ఫ్యామిలీ బాక్స్‌లో కూర్చుందని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.  

Also read: కొన్ని విషయాలను బహిరంగంగా చెప్పలేము...ధోని రిటైర్మెంట్ పై గంగూలీ

అనుష్క మ్యాచ్ చూసే సమయంలో తన పక్కన ఏ సెలెక్టర్‌ కూడా లేడని విరాట్ కోహ్లీ తెలిపాడు. అనుష్క సెలెబ్రిటీ కాబట్టి ఆమె పేరును వివాదాల్లోకి లాగితే తమకు కూడా పాపులారిటీ వస్తుందని భావించి ఇలా చీప్ పబ్లిసిటీ ద్వారా  కొందరు లాభపడుతున్నారని కోహ్లీ అన్నాడు.  

సెలెక్టర్ల గురించి మాట్లాడుతున్నప్పుడు అనవసరంగా తన భార్య పేరును తీసుకురావడం ఎంత వరకు సమంజసమని కోహ్లీ అన్నాడు. 

ఇక అనుష్క శర్మ గతంలో ఫరూక్ ఇంజనీర్ చేసిన వ్యాఖ్యలను గతంలోనే ఖండించింది. అనుష్క ఎందుకు స్పందించవలిసివచ్చిందో కూడా కోహ్లీ వివరించాడు. 

అదేపనిగా అబద్ధాలు చెబితే వాటినే ప్రజలు నిజమనుకునే ఆస్కారం ఉంది కాబట్టే, అనుష్క శర్మ ఇటీవల స్పందించిందని కోహ్లీ వివరించాడు.