ప్రపంచ కప్ మెగా టోర్నీలో టైటిల్ పేవరెట్ గా బరిలోకి దిగుతున్న టీమిండియా అనూహ్య ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా విఫలమవడంతో భారత్ ఓటమిపాలయ్యింది. దీంతో భారత జట్టులో కూర్పుపై మరోసారి చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా బౌలర్ల విషయంలో టీమిండియా మేనేజ్ మెంట్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని మాజీలు, క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. లేదంటే వార్మఫ్ మ్యాచ్ లో వచ్చిన ఎదుర్కొన్న ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరిస్తున్నారు. 

న్యూజిలాండ్ తో జరిగిన వార్మఫ్ మ్యాచ్ లో టీమిండియా ఓటమిపై మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ స్పందించారు. ఇంగ్లాండ్ వేదికన జరగనున్న ఈ ప్రపంచ కప్ లో ఫేసర్్లు ప్రముఖ పాత్ర పోషించనున్నారు. అయితే మిడిల్ ఓవర్లలో పరుగులను కట్టడిచేయడం, వికెట్లు పడగొట్టడంలో స్పిన్నర్లూ ఉపయోగపడతారు. అయితే భారత జట్టులో బుమ్రా, షమీ, భువనేశ్వర్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రూపంలో నాణ్యమైన ఫేసర్లున్నారు. అలాగే కుల్దీప్ యాదవ్, మజువేందర్ చాహల్ రూపంలో మంచి స్పిన్నర్లు కూడా భారత జట్టులో వున్నారని మంజ్రేకర్ గుర్తేచేశారు. 

అయితే వీరందరిని ఓకే మ్యాచ్ ఆడించడం కుదరకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అలాంటి సమయంలో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లకు (కుల్దీప్, చాహల్) జట్టులో అవకాశం కల్పించాలని అనుకుంటే ఓ ఫేసర్ ను పక్కనపెట్టాల్సి వస్తుంది. ఆ  సమయంలో ఫేసర్ భువనేశ్వర్ పై వేటు పడే అవకాశముందన్నారు. ఎందుకంటే బుమ్రా జట్టులో కీలక బౌలర్, షమీ ఈ మధ్య కాలంలో నిలకడగా ఆడుతుండటం, పాండ్యా ఆల్ రౌండర్ గా పనికొస్తాడు. కాబట్టి వీరెవరిని పక్కనబెట్టే సాహసం మేనేజ్ మెంట్ చేయకపోవచ్చు. కాబట్టి అలాంటి సమయంలో భువనేశ్వర్ ను పక్కనపెట్టే అవకాశాలున్నాయని మంజ్రేకర్ తెలిపారు. 

 స్పిన్నర్లు కుల్దీప్, చాహల్ లు గతంలో విదేశాల్లో జరిగిన మ్యాచుల్లో అద్భుతంగా రాణించారని మంజ్రేకర్ గుర్తుచారు. అదే సమయంలో భువనేశ్వర్ కు వన్డే ఫార్మాట్ లో అంత గొప్ప రికార్డేమీ లేదన్నారు. కాబట్టి టీంమేనేజ్ మెంట్ స్పిన్నర్లిద్దరిని తీసుకుంటే భువనేశ్వర్ ను  పక్కనపెట్టడం ఖాయమని మంజ్రేకర్ అన్నారు.  

 ప్రపంచ కప్ వార్తలు  

2019 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. జూన్ 16న పాక్‌తో భారత్ ఢీ