Asianet News TeluguAsianet News Telugu

పంత్ ఫియర్ లెస్ కాదు కేర్‌లెస్: మరోసారి విరుచుకుపడ్డ గంభీర్

టీమిండియా యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ పై మాజీ  క్రికెటర్ గంభీర్ విరుచుకుపడ్డాడు. కేవలం టీమిండియా మేనేజ్‌మెంట్ వల్లే అతడింకా జట్టులో కొనసాగుతున్నాడని పేర్కొన్నాడు. 

veteran cricketergaautam gambhir slams Indian team management
Author
New Delhi, First Published Sep 22, 2019, 8:00 PM IST

మాజీ క్రికెటర్, బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్ మరోసారి యువ క్రికెటర్ రిషబ్ పంత్ పై విరుచుకుపడ్డాడు. టీమిండియాకు వికెట్ కీపర్ గానే కాదు బ్యాట్స్ మెన్ గా కూడా పంత్ పనికిరాడంటూ కాస్త ఘాటుగా విమర్శించాడు. కేవలం టీమిండియా మేనేజ్‌మెంట్ పుణ్యానే అతడింకా జట్టులో కొనసాగుతున్నాడు. లేదంటే ఎప్పుడో పంత్ కు భారత జట్టులో చోటు కోల్పోయేవాడని గంభీర్ అన్నాడు. 

''గంతంలోనూ...ఇప్పుడూ తాను ఒకే మాట చెబుతున్నా. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ గా పంత్ కంటే సంజూ శాంసన్ చాలా గొప్ప ఆటగాడు. కానీ అతడిని కాదని టీమిండియా సెలెక్టర్లు, మేనేజ్‌మెంట్ పంత్ నే నమ్మారు. కానీ వారి నమ్మకాన్ని నిలుపుకోలేకపోయినా మళ్లీ అతడికే అవకాశాలిస్తున్నారు. అతడంటే వారికి ఎందుకంత ప్రేమో నాకయితే అర్థం కావడం లేదు. 

మీకు పంత్ పై అంత ప్రేముంటూ బ్యాకప్ ఆటగాడిగా కొనసాగించండి. కానీ ఎన్నిసార్లు విఫలమైనా మళ్లీ అతడికే అవకాశమిచ్చి జట్టు ప్రయోజనాలను దెబ్బతీయకండి. రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగే ఆటగాడి లక్షణాలు పంత్ లో తనకు ఇప్పటివరకు ఒక్కటి కూడా కనిపించలేవు. 

వెస్టిండిస్ పర్యటనలో పంత్ ఘోరంగా విఫలమైనప్పటికి మేనేజ్‌మెంట్ అతడిపై పొగడ్తలను మాత్రం ఆపడంలేదు. ఇటీవల ఫియర్‌లెస్ క్రికెటర్ గా అతన్నిఅభివర్ణించారు. కానీ వారు అన్నట్లు పంత్ భయమన్నదే  ఎరుగని ఆటగాడేమీ కాదని...కేవలం కేర్‌లెస్ క్రికెటర్ మాత్రమే. 

రిషబ్ పంత్ కంటే మంచి ప్రతిభగల ఆటగాళ్లు భారత జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటివారిలో అత్యుత్తమ వికెట్ కీపర్లు కూడా వున్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం సంజూ శాంసన్ మంచి ప్రతిభగల ఆటగాడు. అతడికి అవకాశమిస్తే బావుంటుంది.''అని  గంభీర్ అభిప్రాయడపడ్డాడు.

సంబంధిత వార్తలు

రిషబ్ పంత్ కు శాంసన్ రూపంలో ప్రమాదం...నా మద్దతు ఎవరికంటే...: గంభీర్


  

Follow Us:
Download App:
  • android
  • ios