సూపర్-8లో అమెరికా అద్భుత పోరాటం.. సౌతాఫ్రికా సూపర్ విక్టరీ
T20 World Cup 2024 USA vs SA: తన తొలి సూపర్-8 మ్యాచ్ లో అమెరికా అద్భుత పోరాటం చేసింది. కానీ, కీలక సమయంలో రబడ వికెట్ తీయడంతో సౌతాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. కగిసో రబడ 3 వికెట్లు తీసుకున్నాడు.
T20 World Cup 2024 USA vs SA: టీ20 ప్రపంచ కప్ 2024 లో అమెరికా జట్టు అద్భుత ప్రదర్శనతో గ్రూప్ దశ నుంచి సూపర్-8 కు చేరుకుంది. ఈ రౌండ్ లో తన తొలి మ్యాచ్ లోనూ అద్భుత ప్రదర్శన చేసింది. అయితే, కీలక సమయంలో వికెట్లు కాపాడుకోకపోవడంతో ఓటమిపాలైంది. టీ20 ప్రపంచ కప్ 2024లో సూపర్-8 తొలి మ్యాచ్ లో యూఎస్ఏ, దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి. మొదటి రౌండ్‌లో రెండు జట్లూ అద్భుత ప్రదర్శన కనబర్చగా, గ్రూప్-ఏలో యూఎస్‌ఏ రెండో జట్టుగా అర్హత సాధించగా, గ్రూప్-డీలో దక్షిణాఫ్రికా తొలి ప్లేస్ తో అర్హత సాధించింది. 2024 టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. యూఎస్ఏ గ్రూప్ దశలో భారత్ చేతిలో ఓటమిపాలైంది.
సూపర్-8 తొలి మ్యాచ్ లో అమెరికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టు క్వింటన్ డీకాక్, ఐడెన్ మార్క్రమ్ సూపర్ ఇన్నింగ్స్ లతో 4 వికెట్లు కోల్పోయి 194 పరుగుల భారీ స్కోర్ చేసింది. డీకాక్ 74 పరుగులు, మార్క్రమ్ 46 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 36*, ట్రిస్టన్ స్టబ్స్ 20* పరుగులు చేశారు. యూఎస్ఏ బౌలర్లలో నేత్రవల్కర్, హర్మీత్ సింగ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
195 పరుగుల టార్గెట్ ను ఛేదించడానికి బ్యాటింగ్ కు దిగిన అమెరికాకు వికెట్లు పడుతున్నప్పటికీ మంచి స్కోర్ లభించింది. కానీ, 76 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్, హర్మిత్ సింగ్ లు మంచి ఇన్నింగ్స్ తో జట్టులో విజయం ఆశలు నింపారు. అయితే, 19 ఓవర్ తొలి బంతికే హర్మిత్ సింగ్ ఔట్ కావడంతో అమెరికా ఫైట్ ముగిసింది. ఆండ్రీస్ గౌస్ 80 పరుగులు అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు కానీ, జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. హర్మీత్ సింగ్ 38, స్టీవెన్ టేలర్ 24 పరుగులు చేయగా, మిగతా ప్లేయర్లు పెద్దగా రాణించలేకపోయాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడ 3 వికెట్లు తీసుకున్నాడు. దీంతో అమెరికా విజయానికి 18 పరుగుల దూరంలో ఆగిపోయింది.
టాప్-10 రిచెస్ట్ క్రికెటర్లు వీరే.. భారత్ నుంచి ఎంతమంది ఉన్నారంటే?