Asianet News TeluguAsianet News Telugu

స్టెప్పులేసిన క్యావ్య మార‌న్.. ఏడ్చేసిన ఫ్యాన్స్.. వైర‌ల్ వీడియోలు

SRH vs RR: ఐపీఎల్ 2024లో ఆరంభం నుంచి విన్నింగ్ ట్రాక్ లో కొన‌సాగిన రాజస్థాన్ ప్రయాణం ఫైనల్‌కు ముందే ముగిసింది. క్వాలిఫ‌య‌ర్ 2 లో హైదరాబాద్ చేతిలో 36 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓడిపోయింది. దీంతో చెపాక్ స్టేడియంలో కావ్య మార‌న్ డాన్సులు.. ఓ వైపు ఆనందం.. మరోవైపు కన్నీటి దృశ్యాలు వైర‌ల్ అవుతున్నాయి.
 

Sunrisers Hyderabad's Kavya Maran dance, Rajasthan Royals fans cry Viral Video SRH vs RR, IPL 2024 RMA
Author
First Published May 25, 2024, 12:56 AM IST

IPL 2024, SRH vs RR: ఐపీఎల్ 2024 క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉంచిన 176 ప‌రుగుల టార్గెట్ ను ఛేదించే క్ర‌మంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 139-7 ప‌రుగులు మాత్ర‌మే చేసి 36 పరుగుల తేడాతో ఓడిపోయింది.  ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టిన స‌న్ హైద‌రాబాద్ టీమ్ ఫైనల్ కు చేరుకుంది. ఐపీఎల్ 2024 ఛాంపియ‌న్ టైటిల్ కోసం కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ త‌ల‌ప‌డ‌నుంది. క్వాలిఫయర్-1లో ఓటమికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని చూస్తోంది.

అయితే, ఐపీఎల్ 2024 ప్రారంభం నుండి విన్నింగ్ ట్రాకులో పయనిస్తున్న రాజస్థాన్ ప్రయాణం, ఫైనల్‌కు ముందే ముగించింది. హైదరాబాద్ జట్టు 36 పరుగుల తేడాతో రాజస్థాన్‌ను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత చెపాక్ స్టేడియంలోని దృశ్యాలు వైర‌ల్ గా మారాయి. ఓ వైపు హైద‌రాబాద్ అభిమానులు సంబరాల్లో మునిగితేలుతుండగా, మరోవైపు రాజస్థాన్‌కు చెందిన కొందరు అభిమానుల ముఖాల్లో నిరాశ, మరికొందరి కళ్లలో నీళ్లు క‌నిపించాయి. కెప్టెన్ శాంసన్ కూడా నిరాశ‌కు గుర‌య్యాడు.

రాజస్థాన్ అభిమాని కన్నీళ్లు ఆగలేదు..

ఈ సీజన్‌లో రాజస్థాన్ జట్టు అద్భుతంగా కనిపించింది. ఆరంభంలో ఆ జట్టు ఒకదాని తర్వాత ఒకటి వరుస విజయాలను అందుకుంది. అయితే ప్లేఆఫ్‌కు కొద్ది రోజుల ముందు, రాజస్థాన్ విన్నింగ్ ట్రాక్ తప్పింది. దీంతో ఆ జట్టు వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే, తొలి ద‌శ‌ ప్రదర్శన ఆధారంగా జట్టు ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ ఆర్సీబీని ఓడించి క్వాలిఫయర్-2లో చోటు దక్కించుకుంది. కానీ రాజస్థాన్‌ను ఆల్ రౌండ్ షో తో హైదరాబాద్  ఓడించింది. దీంతో రాయ‌ల్స్ అభిమానులు నిరాశ‌కు గురయ్యారు. ఒక అభిమాని గ్రౌండ్ లో ఏడ్చేస్తున్న దృశ్యాలు వైర‌ల్ గా మారాయి.

 

స్టెప్పులేసిన కావ్య మారన్.. 

క్వాలిఫయర్-2లో బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ కాస్త నిరాశతో క‌నిపించారు. కానీ రాజస్థాన్‌లో వికెట్ల పతనాన్ని చూడగానే కావ్య మారన్ ముఖం వెలిగిపోయింది. హైదరాబాద్ విజయంతో కావ్య మారన్ ఆనందంతో స్టెప్పులేశారు. మొద‌ట‌ గంతులేసిన కావ్య‌.. ఆ త‌ర్వాత సరదాగా డాన్స్ కూడా చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

IPL 2024 : ఇంపాక్టు ప్లేయ‌ర్ గా వ‌చ్చి ఇర‌గ‌దీశాడు.. రాజ‌స్థాన్ కు షాకిచ్చాడు... ! 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios