Under 19 World Cup: అండర్-19 వరల్డ్ కప్ లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగడం ఇది మూడోసారి. ఇప్పటివరకు ఆస్ట్రేలియా మూడుసార్లు, భారత్ ఐదు సార్లు అండర్-19 ప్రపంచ కప్ టైటిల్స్ గెలిచాయి.
Under 19 World Cup: అండర్-19 ప్రపంచ కప్ 2024 రెండో సెమీ ఫైనల్స్ లో పాకిస్తాన్ ను ఆస్ట్రేలియా చిత్తు చేసింది. పాక్ ఓటమితో ఆస్ట్రేలియా మరోసారి ఫైనల్ కు చేరుకుంది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం (ఫిబ్రవరి 11) జరగనుంది. భారత జట్టు ఇప్పటికే ఫైనల్స్ కు చేరుకుంది. బెనోనీలో భారత్ తో ఆస్ట్రేలియా ఫైనల్స్ తో తలపడనుంది. ఉత్కంఠగా సాగిన రెండో సెమీ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా జట్టు ఒక వికెట్ తేడాతో పాక్ ను ఓడించింది. ఓవరాల్ గా ఆరోసారి టైటిల్ పోరుకు చేరుకుంది.
ఇప్పటివరకు ఆస్ట్రేలియా మూడు సార్లు టైటిల్ గెలుచుకుంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగడం ఇది మూడోసారి. భారత్ ఇప్పటివరకు ఐదు అండర్-19 టైటిల్స్ గెలుచుకుంది. మూడు సార్లు రన్నరఫ్ గా నిలిచింది. 2000లో మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో, 2008లో విరాట్ కోహ్లి నాయకత్వంలో, 2012లో ఉన్ముక్త్ చంద్ నేతృత్వంలో, 2018లో పృథ్వీ షా నేతృత్వంలో, 2022లో యశ్ ధుల్ నేతృత్వంలో అండర్-19 కప్ ను భారత్ గెలిచింది.
అండర్-19 ప్రపంచ కప్ 2024 రెండో సెమీ ఫైనల్స్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. దీంతో పాక్ 48.5 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. పాక్ ప్లేయర్లలో అజాన్ అవేష్ 52, అరాఫత్ మిన్హాస్ 52 పరుగులు చేశారు. వీరిద్దరు మినహా ఓపెనర్ షమ్యాల్ హుస్సేన్ మాత్రమే డబుల్ డిజిట్ చేరుకోగా, మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో టామ్ స్టార్కర్ ఆరు వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా జట్టు 49.1 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి విజయం సాధించింది.
హెలికాప్టర్ షాట్స్ మోత.. ! ఐపీఎల్ కోసం ధోని మొదలు పెట్టాడు.. !
ఇక ఆస్ట్రేలియా విషయానికొస్తే ఓపెనర్ హ్యారీ డిక్సన్ 50 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఒలివర్ 49 పరుగులు చేశాడు. ఈ ఇద్దరితో పాటు టామ్ క్యాంప్ బెల్ 25 పరుగులు చేశాడు. అలీ రాజా 10 ఓవర్లలో 34 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అరాఫత్ మిన్హాస్ 2, నవీద్ అహ్మద్ ఖాన్, ఉబైద్ షా చెరో వికెట్ తీశారు.
చివరి ఓవర్లో విజయం..
ఒకానొక సమయంలో ఆస్ట్రేలియా 155 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఒలివర్ పీకే ఔటైన తర్వాత కంగారూ జట్టు ఈ మ్యాచ్ లో ఓడిపోతుందని భావించారు. ఇక్కడి నుంచి లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. పాక్ బౌలింగ్ ను బలంగా ఎదుర్కొన్నాడు. టామ్ స్టార్కర్, రాఫ్ మెక్ మిలన్ కలిసి స్కోరును 164 పరుగులకు చేర్చారు. స్టార్కర్ మూడు పరుగులు చేశాడు. వికెట్ కీపర్ సాద్ బేగ్ చేతిలో అలీ రజా పట్టుబడ్డాడు. అలీ రజా 46వ ఓవర్లో మహిల్ బియర్డ్మన్ ను సున్నా పరుగులకే ఔట్ చేశాడు. మెక్మిలన్, కల్లమ్ విడ్లర్ 17 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించారు. మెక్మిలన్ 29 బంతుల్లో 19 పరుగులు, విడ్లర్ 9 బంతుల్లో 2 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.
స్నేహమంటే ఇదేరా.. ! కోట్ల రూపాయలు కాదని.. ఫ్రెండ్ షాప్ లోగో బ్యాట్ తో ధోని !
