Asianet News TeluguAsianet News Telugu

స్నేహమంటే ఇదేరా.. ! కోట్ల రూపాయ‌లు కాదని.. ఫ్రెండ్ షాప్ లోగో బ్యాట్ తో ధోని !

Ms Dhoni: దిగ్గ‌జ ప్లేయ‌ర్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడూ సాదాసీదాగా ఉంటూ.. సన్నిహితుల పట్ల ధోని ప్రవర్తన ఎప్పుడూ అభిమానుల హృదయాలను గెలుచుకుంటుంది. ఇదే క్ర‌మంలో కోట్ల రూపాయ‌ల‌ స్పాన్సర్‌షిప్‌ కాదు ముఖ్యమంటూ.. త‌న చిన్నినాటి స్నేహితుని షాప్ లోగో ఉన్న బ్యాట్ తో ధోని క్రికెట్ ను ఆడాడు.
 

Dhoni sir you are really super; Chennai Super Kings captain MS Dhoni batting with childhood friend's shop logo bat RMA
Author
First Published Feb 8, 2024, 8:00 PM IST | Last Updated Feb 8, 2024, 8:00 PM IST

Ms Dhoni: ధోని సర్ మీరు నిజంగా సూపర్.. ఎంత ఎదిగినా ఒదిగిఉండాల‌నీ, స‌న్నిహితుల ప‌ట్ల డ‌బ్బును తూకం వేస్తూ న‌డుచుకోకూడ‌ద‌ని మ‌రోసారి నిరూపించి అందరికీ ఆద‌ర్శంగా నిలిచారు. అలా ధోని ఏం చేశార‌ని అనుకుంటున్నారా..? కోట్ల రూపాయ‌ల‌ స్పాన్సర్‌షిప్‌ అందించేవి కాదు ముఖ్యం.. మనకు సాయం చేసిన వారు.. మన అనుకున్న వాళ్లు అంటూ నిరూపిస్తూ.. త‌న చిన్నినాటి స్నేహితుని షాప్ లోగో ఉన్న బ్యాట్ తో ధోని క్రికెట్ ఆడారు. త‌న స్నేహితుని చిన్న‌ షాప్ కు త‌న‌వంతు ప్ర‌చార సాయం క‌ల్పించారు.

వివ‌రాల్లోకెళ్తే.. క్రికెట్ దిగ్గ‌జం ఎంఎస్ ధోని చిన్ననాటి స్నేహితుడికి రాంచీలో స్పోర్ట్స్ ఎక్విప్ మెంట్ షాప్ ఉంది. ధోనీ తన బ్యాట్ పై త‌న స్నేహితుని షాప్ పేరు స్టిక్కర్ అంటించుకున్నాడు. ఈ బ్యాట్ తోనే ధోనీ రాబోయే ఐపీఎల్ కోసం నెట్స్ లో ప్రాక్టిస్ చేస్తూ క‌నిపించాడు. చిన్ననాటి స్నేహితుడి దుకాణం షాప్ పేరుతో వ‌చ్చిన ఆ బ్యాట్ తో చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రాక్టిస్ చేస్తున్న ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ప్రొఫెషనల్ క్రికెటర్ గా ఎదిగే క్రమంలో తనకు సహకరించిన వారిని ధోనీ ఎప్పుడూ మరచిపోలేదు. ఆయన ఎప్పుడూ కృతజ్ఞత వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ధోనీ తన చిన్ననాటి స్నేహితుడికి కృతజ్ఞతగా తన షాప్ స్టిక్కర్ ను బ్యాట్ పై అతికించాడు. దీంతో ఒక్క‌సారిగా తన స్నేహితుడి దుకాణానికి ఆదరణ పెరిగింది.

 

రాంచీలో ధోనీ స్నేహితుడి స్పోర్ట్స్ ఎక్విప్ మెంట్ షాప్ పేరు ప్రైమ్ స్పోర్ట్స్. క్రికెట్ ప్రారంభ ప్ర‌యాణం మొద‌లు పెట్టిన స‌మ‌యంలో ధోనీకి ఎంతో సాయం చేశాడు. దానిని గుర్తుంచుకునీ, త‌మ స్నేహం ఎప్ప‌టికీ చెరిగిపోద‌ని నిరూపిస్తూ..  ఈసారి ధోనీ తన స్నేహితుని దుకాణాన్ని ప్రమోట్ చేయడంలో సాయపడ్డాడు. ధోని క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు, చాలా మంది చిన్ననాటి స్నేహితులు అతనికి సహాయం చేశారు. త‌న‌ బయోపిక్ లో ధోని తన కెరీర్ లో స్నేహితుల సహకారం గురించి ప్రస్తావించాడు. పరమ్ జిత్ సింగ్ చాలా సాయం చేశారు. ఫేమస్ క్రికెటర్ అయ్యాక ధోనీ తన స్నేహితులను మర్చిపోలేదు. సీఎస్కే కెప్టెన్ తన కెరీర్ ఆరంభంలో తనకు తోడుగా ఉన్న వారితో ఇప్పటికీ టచ్ లో ఉన్నారు.

హెలికాప్ట‌ర్ షాట్స్ మోత.. ! ఐపీఎల్ కోసం ధోని మొదలు పెట్టాడు.. !

2019 వన్డే వరల్డ్ క‌ప్ లో కూడా ధోనీ పలు రకాల బ్యాట్లను ఉపయోగించాడు. ఒక్కో బ్యాట్ కు ఒక్కో స్పాన్సర్ స్టిక్కర్ ఉంది. తన కెరీర్ లో తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ధోని తన బ్యాట్ పై స్టిక్కర్లను ఉపయోగించాడు. అదే ధోనీకి చివరి ప్రపంచకప్. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికే ముందు ఈ స్టార్ అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ధోని స్పాన్సర్ స్టిక్కర్ల‌కు కోట్ల రూపాయ‌లు కుమ్మ‌రించే కంపెనీల‌తో పాటు ఒక్క‌రూపాయి కూడా తీసుకోకుండా ధోని త‌న స్నేహితునికి ఇలా సాయం చేయ‌డం ధోని అంద‌రికీ అద‌ర్శంగా నిలుస్తున్నారు.

కుర్చీని మ‌డ‌త‌పెట్టి.. విరాట్ కోహ్లీ-అనుష్క‌ల డాన్స్ అదిరిపోయిందిగా.. ! వీడియో 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios