వెల్లింగ్టన్: పక్కా ప్రణాళిక ప్రకారమే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని బోల్తా కొట్టించామని న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అన్నాడు. కట్టుదిట్టమైన బౌలింగ్ చేయకపోతే విరాట్ కోహ్లీ బౌండరీలు కొడుతాడని, దాంతో షార్ట్ బంతులతో కోహ్లీని అడ్డుకోవాలని అనుకున్నామని, దాంతో రన్ రేట్ తగ్గించి అతన్ని అడ్డుకోగలమని భావించామని ఆయన వివరించాడు. 

ఆ ప్రణాళికతోనే విరాట్ కోహ్లీని ఔట్ చేశామని, జేమీసన్ బాగా బౌలింగ్ చేస్తున్నాడని, ముఖ్యంగా విరాట్ కోహ్లీకి మంచి స్పెల్ వేశాడని ఆయన అన్నాడు. బేసిన్ రిజర్వ్ మైదానంలో ఆడిన అనుభవం తనకు కలిసి వచ్ిచందని ఆయన చెప్పాడు. 

Also Read: టీమిండియా ఘోర ఓటమి.. నెటిజన్ల విమర్శలకు కోహ్లీ స్ట్రాంగ్ కౌంటర్

ఇక్కడ గాలి ఎక్కువగా వీస్తుందని, దాన్ని గమనిస్తూ బౌలింగ్ చేయాల్సి ఉంటుందని, న్యూజిలాండ్ లో ఎర్ర బంతి అంతగా స్వింగ్ కాదని, క్రీజును వాడుకుని యాంగిల్స్ మారుస్తూ బంతులు విసరాలని ఆయన అన్నాడు. అలా చేస్తే బ్యాట్ మెన్ ను కట్టడి చేయవచ్చునని, ఇక్కడి పరిస్థితులను బట్టి ఎరౌండ్ ది వికెట్ వేయడం మంచిదని ఆయన అన్నాడు. 

న్యూజిలాండ్ పై జరిగిన తొలి టెస్టు మ్యాచులో భారత్ పది వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. వికెట్లు తీయడంలో ట్రెంట్ బౌల్ట్ కీలక పాత్ర పోషించాడు. 

Also Read: టాస్ దెబ్బ తీసింది, బ్యాటింగ్ లో ఫెయిల్: ఓటమిపై విరాట్ కోహ్లీ