Asianet News TeluguAsianet News Telugu

టీమిండియా ఘోర ఓటమి.. నెటిజన్ల విమర్శలకు కోహ్లీ స్ట్రాంగ్ కౌంటర్

న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోవడంపై ఫ్యాన్స్ నిరుత్సాహ పడ్డారు. మరీ దారుణంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో.. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. ఆ విమర్శలకు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

"Can't Help If People Want To Make A Big Deal": Virat Kohli On India's Crushing Defeat
Author
Hyderabad, First Published Feb 24, 2020, 10:56 AM IST

న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘోర ఓటమిని మూటగట్టుకుంది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 191 పరుగలకే ఆలౌట్ అయిపోయింది. అంతకముందు కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 348 పరుగులు చేసింది. దీంతో ఆ  జట్టుకి 183 పరుగుల ఆధిక్యం లభించింది.  రెండో ఇన్నింగ్స్ లోనూ మరో తొమ్మిది పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది.

కాగా.. న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోవడంపై ఫ్యాన్స్ నిరుత్సాహ పడ్డారు. మరీ దారుణంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో.. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. ఆ విమర్శలకు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Also Read టాస్ దెబ్బ తీసింది, బ్యాటింగ్ లో ఫెయిల్: ఓటమిపై విరాట్ కోహ్లీ...

‘మాకు తెలుసు.. మేము బాగా ఆడలేదు అని. కానీ ప్రజలు దీనిని చాలా పెద్దదిగా చేసి చూస్తే మేము ఎలాంటి సహాయం చేయలేం’ అని కోహ్లీ పేర్కొన్నాడు. ఒక్క టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం వల్ల తమ జట్టుకి ఇదేమీ ప్రపంచం అంతమైపోయినట్లు కాదని కోహ్లీ పేర్కొన్నాడు.

‘చాలా మంది మేము ఈ మ్యాచ్ ఓడిపోవడం వల్ల ప్రపంచం మొత్తం ముగిసిపోయినట్లు భావిస్తున్నారు. కానీ ఇది మాకు కేవలం ఒక  క్రికెట్ మ్యాచ్ మాత్రమే. దీనిని ఇక్కడితోనే వదిలేస్తాం.. తిరిగి మళ్లీ మా తలలు పైకెత్తుకునేలా చేస్తాం’ అంటూ కోహ్లీ కౌంటర్ ఇచ్చాడు.  అంతేకాకుండా తాము తర్వాతి మ్యాచ్ లో గెలవడానికి ఏం చేయాలో తమకు అంటూ గట్టిగా సమాధానం ఇచ్చాడు.

Follow Us:
Download App:
  • android
  • ios