కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోని అన్ని రకాల క్రీడా టోర్నీలు వాయిదాపడటమో, రద్దవ్వడమో జరిగింది. ఇందుకు క్రికెట్ కూడా మినహాయింపు కాదు. క్షణం తీరిక లేని బిజీ షెడ్యూల్‌తో గడిపే క్రికెటర్లు ఈ లాక్‌డౌన్ సమయంలో కుటుంబసభ్యులతో ఏంజాయ్ చేస్తున్నారు.

Also Read:అక్కడ ధోనీది కాదు.. సాక్షి మాటే శాసనం: పెంపుడు కుక్కతో మిస్టర్ కూల్ ఆటలు

ఈ క్రమంలో పలువురు విదేశీ క్రికెటర్లను మన తెలుగు సినిమా పాటలు ఆకట్టుకుంటున్నాయి. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంభినేషన్‌లో వచ్చిన అల... వైకుంఠపురం మూవీలో తమన్ అందించిన పాటలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి.

ఈ సినిమాలోని బుట్ట బొమ్మ పాట చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటకు ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు డేవిడ్ వార్నర్ దంపతులు డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read:అందాలు ఆరబోస్తూ డ్యాన్స్... ట్రోల్స్ కి షమీ భార్య ఘాటు రిప్లై

ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి ఇంగ్లాండ్ మాజీ సారథి, క్రికెట్ కామెంటేటర్ కెవిన్ పీటర్సన్‌ కూడా చేరాడు. ఈ పాటకు ముగ్ధుడైన కెవిన్ టిక్ టాక్ వీడియో చేసి.. హుక్ స్టెప్పుడు వేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.