తనపై వస్తున్న ట్రోల్స్ కి టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్  ఘాటుగా స్పందించింది. సోషల్‌మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్‌ని, విమర్శలను పట్టుంచుకోనని ఆమె పేర్కొంది.

నెటిజన్లు తనను ఎంత ట్రోల్ చేసినా.. తాను పట్టించుకోనని ఆమె స్పష్టం చేశారు. అంతేకాక.. మరిన్ని వీడియోలు ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే.. కొద్ది రోజుల క్రితం ఓ హిందీ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియోను హసీన్ జహాన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో పాటకు తగ్గట్టు డ్యాన్స్ చేస్తూ తన అందాలను ఎక్స్‌పోజ్ చేసింది. దీంతో  చిర్రెత్తుకుపోయిన అభిమానులు హసీన్‌పై మాటల దాడికి దిగారు.

ముఖ్యంగా పవిత్రమైన రంజాన్ మాసంలో ఇటువంటి పనులు చేయడం ఏంటని వాళ్లు విమర్శల వర్షకురిపించారు. అయితే వీటిపై హసీన్ ఘాటుగా స్పందించింది. తనను ట్రోల్ చేసే వాళ్లని కుక్కలతో పోల్చిన ఆమె.. కుక్కలు మొరుగుతుంటే.. తాను పట్టించుకోనని పేర్కొంది. 

‘‘ఇంటి ముందు ఒక మురికి కాలువ ఉంటే.. మనం ఆ ఇంట్లో ఉండటం మానేస్తామా.. కుక్కలారా.. మీరు ఎంత అరిచినా.. నేను ఇలానే జీవిస్తాను. మంచి చెడు ఏదో కుక్కలు నేర్పిస్తాయట’’ అంటూ ఆమె ట్రోలర్లను ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. 

 

రెండేళ్ల క్రితం హాసీన్ జహాన్ షమీపై సంచలన ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. షమీకి వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని.. అది తనకు తెలిసిపోయిందని.. అతను, అతని కుటుంబసభ్యులు లైంగికంగా వేధించారని ఆమె పేర్కొంది.

 అంతేకాక.. అతనిపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా చేసింది. దీంతో అతన్ని సస్పెండ్ చేసిన బీసీసీఐ విచారణ చేపట్టింది. విచారణలో షమీ ఎటువంటి మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడలేదని రుజువు కావడంతో బీసీసీఐ అతనికి క్లీన్ చీట్ ఇచ్చింది. తొలుత హసీన్ జహాన్ చేసిన ఆరోపణలు నిజమని అందరూ నమ్మారు. ఆమెకు మద్దుతుగా నిలిచారు. ఎప్పుడైతే అవి నిజం కాదని తేలిందో... అందరూ షమీకి మద్దతుగా నిలవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో హసీన్ జహాన్ ని విమర్శిస్తున్నారు.