42 ఏండ్ల వ‌య‌స్సులోనూ దుమ్మురేపాడు.. ధోని దెబ్బ‌కు హార్దిక్ అబ్బా.. సరికొత్త రికార్డులు

MS Dhoni hat-trick sixes : ముంబ‌యి ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ను చీల్చిచెండాడాడు ఎంఎస్ ధోని. కేవ‌లం 4 బంతుల్లోనే హ్యాట్రిక్ సిక్స‌ర్లతో 20 ప‌రుగులు కొట్టాడు. అనేక రికార్డులు సృష్టించాడు. 
 

At the age of 42, he was also dusted off. MS Dhoni's record innings off Hardik Pandya's bowling IPL 2024 RMA

MS Dhoni hat-trick sixes records : ఐపీఎల్ 2024 29వ మ్యాచ్ వాంఖడే స్టేడియం వేదిక‌గా జ‌ర‌గ్గా, ఇందులో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ త‌ల‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ సీఎస్‌కే అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఎంఎస్ ధోని కొట్టిన హ్యాట్రిక్ సిక్స‌ర్లు హైలెట్ గా నిల‌వ‌డంతో పాటు చెన్నై విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాయి. ధోనీ వ‌రుస హ్యాట్రిక్ సిక్స‌ర్ల‌తో హార్దిక్ పాండ్యా బౌలింగ్ ను ఉతికిపారేస్తూ అనేక రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు. ఏకంగా 42 ఏండ్ల వ‌య‌స్సులో ధోని అద్భుతమైన చిన్న ఇన్నింగ్స్ వైర‌ల్ గా మారింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ టోర్నీలో ముంబైపై చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ ఎడిషన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై నాలుగో విజ‌యాన్ని అందుకుంది. ముంబైకి ఇది 4వ ఓట‌మి. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 69, శివమ్ దూబే 66* పరుగుల సాయంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ కొట్టాడు కానీ, జ‌ట్టుకు విజయాన్ని అందించ‌లేకోయాడు. లక్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ శర్మ సెంచరీ (105)తో అజేయంగా నిలిచాడు.

ASTEST 100S IN IPL : ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ టాప్-5 సెంచ‌రీలు ఇవే...

ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు విజయం సాధించినప్పటికీ, వాంఖడే మైదానంలో మళ్లీ ధోనీ విధ్వంసాన్ని చూసే అవకాశం వచ్చింది. 20వ ఓవర్‌లో ధోనీ 4 బంతులు మాత్రమే ఎదుర్కొని అజేయంగా 20 పరుగులు చేశాడు. డారిల్ మిచెల్ పెవిలియన్ కు చేరిన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ.. హార్దిక్ పాండ్యా బౌలింగ్ ను ఉతికిపారేస్తూ హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగారు. దీనికి తోడు 42 ఏళ్ల వయసులో ఏ భారత బ్యాట్స్‌మెన్ చేయలేని రికార్డును ధోనీ సాధించాడు. అవును, ఎంఎస్ ధోనీ ఇప్పుడు ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో మొదటి 3 బంతుల్లో 3 సిక్సర్లు కొట్టిన మొదటి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా ఘనత సాధించాడు. అలాగే, సురేష్ రైనా తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున 5000 పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా ధోనీ నిలిచాడు.

RCB vs SRH Highlights : మాములుగా కొట్ట‌లేదు భ‌య్యా.. హైద‌రాబాద్ మాస్ హిట్టింగ్..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios