Asianet News TeluguAsianet News Telugu

అప్పుడు క్రిస్ గేల్.. ఇప్పుడు ట్రావిస్ హెడ్ సూప‌ర్ సెంచ‌రీతో బ‌ద్ద‌లైన రికార్డులు ఇవే

Travis Head : ఐపీఎల్ 2024 లో ట్రావిస్ హెడ్ త‌న బ్యాట్ తో విధ్వంసం సృష్టిస్తున్నారు. మ‌రోసారి ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో కేవ‌లం 39 బంతుల్లోనే సెంచ‌రీ కొట్టాడు. ఇది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ గెలుపులో కీల‌క ఇన్నింగ్స్ గా నిలిచింది. 
 

Travis Head imitates Chris Gayle's iconic celebration after hitting a century against RCB at Bangalore, these are the records broken  IPL 2024 RCB vs SRH RMA
Author
First Published Apr 15, 2024, 11:45 PM IST

IPL 2024 RCB vs SRH : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 30వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట‌ర్స్ దుమ్మురేపారు. అదిరిపోయే ఇన్నింగ్స్ తో ఐపీఎల్ హిస్ట‌రీలోనే అత్య‌ధిక టీమ్ స్కోర్ ను సాధించింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డుతూ హైద‌రాబాద్ 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 287 ప‌రుగులు చేసింది.

అయితే, బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ట్రావిస్ హెడ్ తన బ్యాట్ సునామీతో విధ్వంసం సృష్టించాడు. త‌న సూప‌ర్బ్ బ్యాటింగ్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ లైనప్‌లో విధ్వంసం సృష్టించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ తన మెరుపు బ్యాటింగ్ ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించాడు. అద్భుత‌మైన  ఆట‌తో తన జట్టుకు విజ‌యాన్ని అందించాడు. ఐపీఎల్ 2024 లో ట్రావిస్ హెడ్ తన గోల్డెన్ టచ్‌ను కొనసాగిస్తూ.. అద్భుతమైన సెంచరీని సాధించాడు. కేవలం 39 బంతుల్లోనే త‌న తొలి ఐపీఎల్ సెంచ‌రీని సాధించాడు. లీగ్ చ‌రిత్ర‌లో హైద‌రాబాద్ టీమ్ నుంచి అత్యంత వేగ‌వంత‌మైన సెంచ‌రీ కూడా ఇదే.

RCB VS SRH : త‌న రికార్డును తానే బ్రేక్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

అయితే, త‌న ఐపీఎల్ తొలి సెంచ‌రీ త‌ర్వాత ట్రావిస్ హెడ్ చేసుకున్న సెల‌బ్రేష‌న్స్ అంద‌రి దృష్టిని ఆకర్షించింది. సంచ‌రీ త‌ర్వాత తన హెల్మెట్‌ను తీసివేసి, దానిని తన బ్యాట్ హ్యాండిల్‌పై బ్యాలెన్స్ చేసి ఎత్తి చూపిస్తూ సెంచ‌రీ సెల‌బ్రేష‌న్స్ జరుపుకున్నాడు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ట్రేడ్‌మార్క్ వేడుకను గుర్తుచేశాడు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు వైర‌ల్ గా మారాయి. హెడ్ 41 బంతుల్లో 102 పరుగుల త‌న ఇన్నింగ్స్ ను 250 స్ట్రైక్ రేట్‌తో కొన‌సాగించాడు. త‌న ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 8 సిక్సర్‌లను బాదాడు. ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ (32)తో కలిసి ఓపెనింగ్ స్టాండ్‌కు 108 పరుగులు జోడించాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన ప్లేయ‌ర్లు సైతం అద‌ర‌గొట్ట‌డంతో హైద‌రాబాద్ భారీ స్కోర్ చేసింది.

 

 

హెన్రిచ్ క్లాసెన్  కూడా అద్భుత‌మైన హాఫ్ సెంచరీతో చెలరేగి, తన జట్టును  200 ప‌రుగుల‌కు పైగా చేరుకునేలా చేశాడు. కీపర్-బ్యాటర్ ఇన్నింగ్స్ 31 బంతుల్లో 67 పరుగులతో ముగించాడు. అతను 217 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ తో దుమ్మురేపాడు. రెండు ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టాడు. మ‌రో ఎండ్ లో ఐడెన్ మార్క్రామ్ కూడా తన జట్టులో కీలక పాత్ర పోషించాడు. చివ‌ర‌లో అబ్దుల్ స‌మ‌ద్ కూడా మెరుపులు మెరిపించాడు.

ఐపీఎల్లో నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీ

ట్రావిస్ హెడ్ కేవలం 39 బంతుల్లో సెంచరీతో ఆడమ్ గిల్ క్రిస్ట్ రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన నాలుగో బ్యాట‌ర్ గా హెడ్ నిలిచాడు. గిల్ క్రిస్ట్ 2008లో 42 బంతుల్లో సెంచరీ సాధించాడు. 2013లో కేవలం 30 బంతుల్లో సెంచరీ చేసిన క్రిస్ గేల్ పేరిట ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు నమోదైంది. ఈ జాబితాలో యూసఫ్ పఠాన్ రెండో స్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో పఠాన్ 37 బంతుల్లో సెంచరీ సాధించాడు. అలాగే, ఆర్సీబీపై డేవిడ్ మిల్లర్ 38 బంతుల్లో సెంచరీ సాధించాడు.

కొడితే స్టేడియం బ‌య‌ట‌ప‌డ్డ బంతి.. హెన్రిచ్ క్లాసెన్ భారీ సిక్స‌ర్ తో స్టేడియం షేక్.. !

 

ధోని కొట్టిన ఆ హ్యాట్రిక్ సిక్సులే చెన్నైని గెలిపించాయి.. ! ముంబైని ముంచేశావ్ క‌దా హార్దిక్

Follow Us:
Download App:
  • android
  • ios