ఆక్లాండ్: న్యూజిలాండ్ తో జరిగిన తొలి టి 20లో భారత్ దుమ్ము దులిపింది. అన్ని విభాగాల్లో భారత జట్టు అగ్రగామి జట్టుగానే ఆడింది. ఆది నుంచి కూడా చిన్న బౌండరీలు ఉన్న ఈడెన్ పార్క్ మైదానంపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. వికెట్లను పడగొడుతూ న్యూజిలాండ్ ని కట్టడి చేయగలిగింది. 

ఒకానొక స్టేజి లో న్యూజీలాండ్ 230 కన్నా ఎక్కువ పరుగులు సాధించే విధంగా కనబడింది. కానీ భారత బౌలర్ల పెర్ఫార్మన్స్ వల్ల న్యూజీలాండ్ ని 203 పరుగులకే భారత బౌలర్లు కట్టడి చేయగలిగారు. 

ఆతరువాత బ్యాటింగ్ కి దిగిన భారత్ జట్టు ఏ పరిస్థితుల్లో కూడా 203 అనేది భారీ స్కోర్ అని భావిస్తున్నట్టు కనబడలేదు. రోహిత్ శర్మ త్వరగా 2వ ఓవర్లోనే అవుటయినా కోహ్లీ, రాహుల్ లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. రాహుల్ ఆటతీరును ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. 

Also read; బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోను రో"హిట్"... కళ్ళు చెదిరే విన్యాసం, వీడియో చూడండి

ఇక రాహుల్, కోహ్లీలు అవుటయ్యిన తరువాత శ్రేయాస్ అయ్యర్ ఆ బాధ్యతను తీసుకొని అర్థ సెంచరీ సాధించి, భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. ఇంకొక ఓవర్ మిగిలి ఉండగానే భారత్ ను విజయతీరాలకు చేర్చాడు శ్రేయాస్ అయ్యర్.

ఈ మ్యాచులో కొన్ని ఆసక్తికరమైన విషయాలను మనం చూడొచ్చు. మామూలుగా భారత జట్టు ఒక భారీ లక్ష్యాన్ని చేధించిందంటే... సదరు క్రికెట్ అభిమాని అడిగే ప్రశ్న, కోహ్లీ ఎంత కొట్టాడు, రోహిత్ ఎంత బాదాడు? కానీ నేటి మ్యాచులో నేటి గెలుపు కోహ్లీ, రోహిత్ ల షో లేకున్నా భారత్ గెలిచింది. 

ఎప్పటినుండో భారత్ ను ఏదైనా సమస్య వేధిస్తోందని అది మిడిల్ ఆర్డర్ సమస్య. కానీ నేటి మ్యాచులో ఆ అనుమానం పటా పంచలు అయింది. మిడిల్ ఆర్డర్ లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ ఆకట్టుకునే ఆటతీరుతో హాఫ్ సెంచరీ నమోదు చేసి భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. 

ఇక మ్యాచ్ నుండి ఒక మంచి సందేశం మాత్రం డ్రెస్సింగ్ రూమ్ కి అంధుడిది. నెంబర్ 3 లో బ్యాటింగ్ కి దిగే కోహ్లీకి ముందు రాహుల్ రూపంలో ఒక స్పెషలిస్ట్, తరువాత నెంబర్ 4 లో మరో స్పెషలిస్ట్ ఉండడం వల్ల కోహ్లీపై భారం తగ్గుతుంది. 

Also read; కివీస్ పై తొలి టీ20: దంచికొట్టిన శ్రేయాస్, బోణీ కొట్టిన కోహ్లీ సేన

ఇక వారికి తోడు హిట్ మాన్ ఉండనే ఉన్నాడు. రోహిత్ శర్మ, రాహుల్ ల భాగస్వామ్య జోడి గనుక క్లిక్ అయితే... ఇక కోహ్లీ తరువాత కూడా శ్రేయాస్ అయ్యర్ రూపంలో ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ ఉండడంవల్ల భారత జట్టుకు అది కలిసి వస్తుంది. 

శ్రేయాస్ అయ్యర్ ఈ మ్యాచులో తనని తాను ఫినిషర్ గా కూడా నిరూపించుకున్నాడు. రాహుల్ ఓపెనర్ గా పునాదులు వేస్తే... కోహ్లీ కొద్దీ తోడ్పాటునందిస్తే శ్రేయాస్ అయ్యర్ కట్టడాన్ని గడువు లోపలే పూర్తి చేసాడు. భారత జట్టుకు ఇప్పుడు ఇలా కోహ్లీకి ముందు రాహుల్, కోహ్లీ తరువాత అయ్యర్ ల రూపంలో మంచి బాలన్స్ దొరికినట్లయింది.