కోహ్లీని స్లెడ్జింగ్ చేస్తే, ఇంకేమైనా ఉందా.. ఐపీఎల్‌లో ఉండరేమోనని: మైఖేల్ క్లార్క్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగానే ఆస్ట్రేలియా క్రికెటర్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని స్లెడ్జింగ్ చేయడానికి భయపడుతున్నారని వ్యాఖ్యానించాడు ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్

australia cricketers sucked up to virat kohli to save ipl Deals: michael clarke

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగానే ఆస్ట్రేలియా క్రికెటర్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని స్లెడ్జింగ్ చేయడానికి భయపడుతున్నారని వ్యాఖ్యానించాడు ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్.

సాధారణంగా ఏ ఫార్మాట్ అయిననా ప్రత్యర్ధి జట్టు ఆటగాడిని స్లెడ్జింగ్ చేయడంలో తమ దేశ క్రికెటర్లు ముందుంటారు. కానీ భారత క్రికెటర్లని, ప్రధానంగా కోహ్లీ మీద నోటీ దురుసు ప్రదర్శించడంలో మాత్రం వెనుకంజ వేస్తున్నారని క్లార్క్ చెప్పాడు.

ఎందుకంటే కోహ్లీని స్లెడ్జింగ్ చేస్తే బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే ఐపీఎల్‌లో ఏ ఫ్రాంఛైజీ కూడా తమని కొనుగోలు చేయదేమోనని తమ క్రికెటర్లు భయపడుతున్నారని చెప్పాడు.

Also Read:అనుష్క పేరెంట్స్ తో కోహ్లీ ఆట.. గెలుపెవరిదంటే..

కాగా ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలంలో ఆస్ట్రేలియాకి చెందిన ఆల్ రౌండర్ పాట్ కమిన్స్‌ని రికార్డు స్థాయిలో రూ.15.5 కోట్లకి కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. అలాగే విధ్వంసక ఆటగాడు మ్యాక్స్‌వెల్, ఆరోన్ ఫించ్ తదితర క్రికెటర్లు కూడా కోట్లాది రూపాయలు పలికారు.

క్రికెట్ ప్రపంచంలో భారత్ తిరుగులేని శక్తి అన్నది అందరికీ తెలసిందే. ఐసీసీని సైతం బీసీసీఐ వ్యతిరేకించగలదు. ఇక సాదాసీదా బోర్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఐపీఎల్‌లో పాకిస్తాన్ మినహా అన్ని దేశాల క్రికెటర్లని భాగస్వామ్యం చేసిన బీసీసీఐ, భారత క్రికెటర్లను  మాత్రం ఏ ప్రైవేట్ టీ20 లీగ్‌లోనూ ఆడేందుకు అనుమతించడం లేదు. అయినప్పటికీ ఏ దేశ క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐ నిర్ణయాన్ని వ్యతిరేకించే సాహసం చేయడం లేదు.

ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లను స్లెడ్జింగ్ చేస్తే... ఐపీఎల్‌లో ఆ దేశ క్రికెటర్లను బీసీసీఐ ఆడించే సాహసం చేస్తుందా..? అని ఆస్ట్రేలియన్ల భయం. అయితే కోహ్లీతో గొడవకు దిగిన బెన్‌స్టోక్స్, రబాడా వంటి క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో స్టార్లుగా కొనసాగుతున్నారు.

Also Read:ఆగు.. కోహ్లీకి చెబుతాం: చాహల్‌కు రోహిత్, బుమ్రా స్వీట్ వార్నింగ్

అయితే ఐపీఎల్‌లో సుమారు 10 మంది క్రికెటర్లు వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తుండగా.. ఇద్దరు సారథ్య బాధ్యతలు కూడా చూస్తున్నారు. ఐపీఎల్‌ మెరుపుల్లో ఆసీస్ క్రికెటర్ల హస్తం కూడా ఉంది.

కేవలం ఆరు వారాల వ్యవధిలోనే రూ.కోట్లు గడించే అవకాశం ఐపీఎల్‌లో ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని అనవసరంగా నోరుజారి పోగొట్టుకునే సాహసం ఎవరూ చేయడం లేదు. కాగా కరోనా వైరస్  కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ ఏప్రిల్ 15 వరకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios