ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీతో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి పేరు మారుమోగుతోంది. అయితే నితీష్ కంటే ముందు ఆసిస్ పై వారి గడ్డపైనే  సెంచరీలు చేసిన  తెలుగు ఆటగాళ్లు ఎవరెవరు వున్నారో తెలుసుకుందాం. 

Nitish Kumar Reddy : ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలుగోడి పేరు మారుమోగిపోతోంది. ఆస్ట్రేలియా గడ్డపై ఆ దేశ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ టీమిండియాకు గౌరవప్రదమైన స్కోరు అందించింది ఈ తెలుగోడే. మెల్ బెర్న్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో భారత జట్టుకు విజయావకాశాలు సజీవంగా వున్నాయంటే ఈ తెలుగోడి సెంచరీ పుణ్యమే. ఇలా ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోపిలో సెంచరీ బాది తనను తాను ప్రపంచానికి చాలా గ్రాండ్ గా పరిచయం చేసుకున్నాడు మన తెలుగబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి. 

బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో మెరుగ్గానే రాణించాడు టీమిండియా యంగ్ ప్లేయర్ నితీష్. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొని 41,38(నాటౌట్),42,42,16 స్కోరు సాధించాడు. ఇక ఈ టెస్ట్ సీరిస్ లో కీలకమైన బాక్సింగ్ డే టెస్ట్ లో తన విశ్వరూపాన్ని చూపించాడు నితీష్. కేవలం 171 బంతుల్లో 100 పరుగులు బాదిన అతడు ప్రపంచానికి తెలుగోడి సత్తా ఏంటో చూపించాడు. అంతేకాదు టీమిండియాకు మంచి స్కోర్ అందించి ఫాలో ఆన్ గండాన్ని తప్పించాడు. 

నితీష్ రెడ్డి సెంచరీ చేయడంతో మెల్ బోర్న్ టెస్ట్ లో టీమిండియా గెలుపు అవకాశాలు సజీవంగా వున్నాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులవద్ద నిలిచింది భారత జట్టు. ఇంకా ఆస్ట్రేలియా కంటే 116 పరుగులు వెనకబడి వుంది. తెలుగు ఆటగాళ్లు నితీస్ కుమార్ రెడ్డి (105 పరుగులు 176 బంతుల్లో), మహ్మద్ సిరాజ్ (2 పరుగులు 7 బంతుల్లో) నాటౌట్ గా నిలిచి క్రీజులో వున్నారు. 

ఇప్పటివరకు ఆసిస్ గడ్డపై సెంచరీ చేసిన తెలుగు ప్లేయర్స్ : 

నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో మరోసారి తెలుగోడి సత్తా బైటపడింది. అయితే ఇలా తెలుగు క్రికెటర్లు ఆసిస్ పై సెంచరీ బాదడం ఇదే తొలిసారి కాదు... గతంలో కూడా పలువురు క్రికెటర్లు శతకాలు బాదారు. ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన నాలుగో తెలుగు ప్లేయర్ నితీష్ రెడ్డి. ఇంతకు ముందు ఈ ఫీటు సాధించిన ఆటగాళ్లు ఎవరెవరో తెలుసుకుందాం. 

1. ఎంఎల్ జైసింహ : 

మోటగానహళ్లి లక్ష్మీనరసు జైసింహ (ML Jaisimha) హైదరాబాద్ లో పుట్టిపెరిగి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. అతడు 1968 లో ఆస్ట్రేలియా గడ్డపై 101 పరుగులు చేసాడు.

2. మహ్మద్ అజారుద్దిన్ :

ఈ హైదరబాదీ టీమిండియా కెప్టెన్ గా కూడా వ్యవహరించారు. ఇతడి 1992లో అడిలైడ్ మైదానంలో అద్భుతంగా బ్యాటింగ్ చేసి 106 పరుగులు సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో సెంచరీ చేసిన రెండో టీమిండియా ప్లేయర్ గా నిలిచాడు.

3. వివిఎస్ లక్ష్మణ్ :

ఈ హైదరబాదీ టీమిండియా ప్లేయర్ కు ఆస్ట్రేలియాపై మంచి రికార్డ్ వుంది. టెస్ట్ క్రికెట్ కు సరిగ్గా సరిపోతుంది వివిఎస్ ఆటతీరు. ఇలా అతడు అద్భుతమైన ఆటతీరుతో ఆసిస్ పై ఏకంగా నాలుగు సెంచరీలు చేసాడు. 2000 సంవత్సరంలో మొదటిసారి శతకం బాదిన లక్ష్మణ్ ఆ తర్వాత వరుసగా 2003,2004, 2008 లో సెంచరీ బాదాడు.

4. నితీష్ కుమార్ రెడ్డి :

వివిఎస్ లక్ష్మణ్ తర్వాత టీమిండియాకు ప్రాతినిధ్య వహించిన తెలుగోళ్ళు చాలా తక్కువ. చివరకు దశాబ్దం తర్వాత నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఓ అద్భుతమైన ఆల్ రౌండర్ టీమిండియాకు ఎంట్రీ ఇచ్చారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతడు బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో రాణించాడు... చివరకు మెల్ బోర్న్ లో జరుగుతున్న భాక్సింగ్ డే టెస్ట్ లో సెంచరీతో అదరగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియాపై టెస్ట్ సెంచరీ సాధించిన నాలుగో తెలుగు క్రికెటర్ గా నితీష్ కుమార్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయాడు. 

ఇంకా చదవండి :

Nitish Kumar Reddy : ఆసిస్ గడ్డపై తెలుగోడి సూపర్ సెంచరీ ... ఎవరీ నితీష్ కుమార్ రెడ్డి?

టీమిండియా పుష్ఫరాజ్ వైల్డ్ ఫైర్ : 'నియవ్వ తగ్గేదేలే' అంటున్న నితీష్ రెడ్డి

ఆసీస్ పై సూప‌ర్ సెంచ‌రీ.. క‌న్నీళ్లు పెట్టుకున్న నితీష్ కుమార్ రెడ్డి తండ్రి.. ఎమోష‌న‌ల్ వీడియో