పాకిస్తాన్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ ఉమర్ అక్మల్ చాలా రోజుల తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు గోల్డెన్ డక్‌ ఔట్‌లతో టీమ్‌లో మరసారి స్థానం కోల్పోయాడు. ఈ క్రమంలో అక్మల్ తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో ఓవరాక్షన్ చేశాడు. ఫిట్‌నెస్ టెస్టు సందర్భంగా నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న ట్రైనర్‌తో ఉమర్ వాగ్వాదానికి దిగాడు. తన శరీరంలో కొవ్వు ఎక్కడుందో చూపించాలని వాదించాడు.

Also Read:ఇండియాకు షాక్: కివీస్ పై వన్డే, టెస్టు సిరీస్ లకు రోహిత్ శర్మ దూరం

ఒక ఫిట్‌నెస్ టెస్ట్ ఫెయిల్ అయిన తర్వాత అసహనానికి గురైన అక్మల్ నోటికి పని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం బోర్డు పెద్దల దృష్టికి వెళ్లడంతో అక్మల్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ నుంచి అక్మల్‌ను నిషేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పాకిస్తాన్ క్రికెట్ జట్టును తిరిగి పోటీలో నిలబెట్టాలని గట్టి పట్టుదలగా ఉన్న హెడ్ కోచ్ మిస్బావుల్ ‌హక్ ముఖ్యంగా ఆటగాళ్ల ఫిట్‌‌నెస్ టెస్టులపై దృష్టి పెట్టాడు. జూనియర్, సీనియర్ స్థాయిలో క్రికెటర్లు ఏ ఫిట్‌నెస్ టెస్టులో విఫలమైనా అతనిని పక్కన పెడతానని ముందు నుంచే చెబుతూ వస్తున్నాడు.

Also Read:న్ స్వీప్... సంజు శాంసన్ సూపర్ స్టంట్ చూశారా?

అంతర్జాతీయ టోర్నీలతో పాటు దేశవాళీ మ్యాచ్‌లకు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాడు. ఇలాంటి పరిస్ధితుల్లోనే ఉమర్ అక్మల్ ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిల్ అయ్యాడు. దీంతో ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించే ట్రైనర్‌పై చిర్రుబుర్రులు ఆడాడు. చొక్కా విప్పి మరీ తన కొవ్వును చూపించు అంటూ వాదనకు దిగాడు.

గతంలో పాకిస్తాన్ జట్టుకు మికీ ఆర్ధర్ కోచ్‌గా ఉన్న సమయంలో కూడా అక్మల్ పదే పదే ఫిట్‌నెస్ టెస్టుల్లో విఫలమయ్యాడు. అప్పుడు ఏకంగా కోచ్‌పైనే విమర్శలు గుప్పించాడు.