ముంబై: న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఈ రెండు సిరీస్ లకు కూడా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడు. న్యూజిలాండ్ పై జరిగిన చివరి టీ20 మ్యాచులో పిక్క కండరాలు పట్టేసిన విషయం తెలిసిందే. 41 బంతుల్లో 60 పరుగులు చేసి ఆ మ్యాచులో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఫీల్డింగ్ కు కూడా రాలేదు. 

న్యూజిలాండ్ పర్యటనకు రోహిత్ శర్మ దూరమవుతున్నాడని, ప్రస్తుతానికైతే నయమయ్యేట్లు కనిపించడం లేదని, ఫిజియో అతన్ని పరీక్షిస్తున్నాడని, గాయం ఎంత తీవ్రమైందో అతను పరీక్షిస్తున్నాడని, అయితే అతను న్యూజిలాండ్ పర్యటనకు మాత్రం దూరమవుతున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు పీటీఐ ఓ వార్తాకథనాన్ని అందించింది.

Also Read: రోహిత్ శర్మకు గాయం: కేఎల్ రాహుల్ స్పందన ఇదీ..

భారత్ న్యూజిలాండ్ పై మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచులు ఆడనుంది. వన్డే సిరీస్ బుధవారం ప్రారంభమవుతుంది. రోహిత్ శర్మ స్థానంలో మయాంక్ అగర్వాల్ కు రిజర్వ్ ఓపెనర్ గా చోటు దక్కే అవకాశం ఉంది. న్యూజిలాండ్ ఏ జట్టుపై ఆడుతున్న ఇండియా ఏ జట్టు తరఫున ఆడుతూ శుభమ్ గిల్ డబుల్ సెంచరీ చేశాడు. ఈ స్థితిలో శుభమ్ గిల్ కు కూడా చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. 

బీసీసీఐ పాత సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ రోహిత్ శర్మ స్థానంలో ఎంపిక చేసిన ఆటగాడి పేరును ప్రకటించే అవకాశం ఉంది. బిసీసీఐ కార్యదర్శి ఆమోదం లభించిన వెంటనే ఆటగాడి పేరును ప్రకటిస్తారు. 

Also Read: విరాట్ కోహ్లీ రికార్డ్ ని బ్రేక్ చేసిన రోహిత్ శర్మ