న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా సత్తా చాటింది. ఐదు టీ20ల సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. మౌంట్ మాంగనూయ్‌లో జరిగిన ఆఖరి టీ20లో కివీస్‌పై భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ల ముందు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ నిలబడలేకపోయారు.

భారత్ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్‌‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత బౌలర్ల మాయాజాలం ముందు న్యూజిలాండ్ క్రికెటర్లు తేలిపోయారు. కాగా... ఈ సిరీస్ ఆఖరి మ్యాచ్ లో యువ క్రికెటర్ సంజు శాంసన్ అదరగొట్టాడు.తన స్టంట్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.

Also Read న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా: శివమ్ దూబే చెత్త రికార్డు...

వరసగా రెండు మ్యాచుల్లో బ్యాటింగ్ లో విఫలమైనా ఫీల్డింగ్ లో అదరగొట్టాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 8వ ఓవర్ చివరి బంతికి కివీస్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్ షార్ట్ మిడ్ వికెట్ లో భారీ షాట్ ఆడాడు. అది సిక్సర్ అని అందరూ భావించారు. కానీ శాంసన్ పరిగెత్తుకుంటూ బౌండర్ లైన్ అవతలకు డైవ్ చేస్తూ బంతిని ఆపేశాడు.

ఆ సమయంలో శాంసన్ కింద పడితే బౌండరీ లైన్ కి తగిలితే తాను పట్టిన క్యాచ్ కి ఉపయోగం ఉండదు. అందుకే తాను గాల్లో ఉండగానే బాల్ ని మైదానంలోకి విసిరేశాడు.  దీంతో కివీస్ రెండు పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. శాంసన్ ఆటను క్రికెట్ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా... ఆదివారం జరిగిన ఐదో టీ20లో భారత్ ఏడు పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో... టోటల్ సిరీస్ ని  టీమిండియా క్లీన్ స్వీవ్ చేసింది.