తమిళనాడు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ తన అటు బ్యాట్, ఇటు బాల్ తోనూ రాణిస్తూ అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇలా అతడి ఆల్ రౌండ్ ప్రదర్శనకు ఫిదా అయిపోయి టీమిండియా కోచ్ ఎమ్మెస్కే ప్రసాద్ ''త్రీ డైమెన్షన్ ప్లేయర్'' అంటూ పొగడడమే కాదు... ప్రపంచ కప్ జట్టులో కూడా అవకాశమిచ్చాడు. ఇలా అంబటి రాయుడు, రిషబ్ పంత్  వంటి యంగ్ క్రికెటర్లను కాదని విజయ్ శంకర్ భారత్ తరపున ప్రపంచ  కప్ ఆడనున్న 15 ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. 

అయితే ఇలా రంజీల నుండి ప్రపంచ కప్ వరకు చేరుకునే వరకు తన కెరీర్ ఎలా సాగిందో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శంకర్ వివరించారు. అందులో అతడు తన కెరీర్ ఇంత అద్భుతంగా సాగడానికి ఓ నోబాల్ ఉపయోగపడిందంటూ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. అతడి కెరీర్ కు నోబాల్ ఎలా ఉపయోగపడిందో అతడి మాటల్లోనే  తెలుసుకుందాం. 

''నేను తమిళ నాడు జట్టు తరపున రంజీ మ్యాచులాడుతున్న రోజులవి. రంజీ ట్రోపీలో భాగంగా ఓ మ్యాచ్ లో నేను, మా కెప్టెన్ కలిసి బ్యాటింగ్ చేస్తున్నాం. అయితే కీలకమైన సమయంలో మా కెప్టెన్ రనౌటయ్యాడు. దీంతోమ అనూహ్యంగా మ్యాచ్ మలుపుతిరిగి ప్రత్యర్థి జట్టు విజయాన్ని అందుకుంది. దీంతో అభిమానుల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో మా కెప్టెన్ తమిళనాడు జట్టుకు దూరమవ్వాల్సి వచ్చింది. 

అయితే ఈ మ్యాచ్ తనలో కసిని పెంచింది. తర్వాత మ్యాచ్ లో అద్భుతంగా ఆడి విమర్శించిన వారి నుండే ప్రశంసలు పొందాలనుకున్నాను. కానీ ముంబైతో జరిగిన మ్యాచ్ లో నేను మరోసారి తడబడ్డాను. శార్దూల్ వేసిన ఓ అద్భుతమైన బంతికి నేను క్లీన్ బౌల్డ్ అయ్యాను.  ఇలా ఐదు పరుగల వద్దే నేను ఔటయినప్పటికి అది నోబాల్ కావడంతో బ్రతికి బయటపడ్డాను. ఆ తర్వాత  ఎలాంటి తడబాటే  లేకుండా బ్యాటింగ్ చేసి  95 పరుగులు సాధించి జట్టుకు విజయాన్ని అందించాను.

ఆ మ్యాచ్ లో శార్దూల్ గనుక నోబాల్ వేయకుంటే నాకు కూడా తమిళనాడు తరపున అదే చివరి మ్యాచ్ అయ్యేదేమో. ఆ తర్వాత నేను భారత‘ఎ’ జట్టుకు ఎంపిక కావడంతో పాటు జాతీయ జట్టులో చోటు సంపాదించాను. ఆప్పుడిలా ప్రపంచ కప్ ఆడే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాను.'' అంటూ శంకర్ ఓ నోబాల్ తన కెరీర్ ను ఎలా మలుపుతిప్పిందో వివరించాడు. 


ప్రపంచ కప్ వార్తలు  

2019 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. జూన్ 16న పాక్‌తో భారత్ ఢీ