క్రికెట్‌లో అప్పుడప్పుడు కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి. దక్షిణాఫ్రికా జట్టు 434 పరుగులను ఛేదించి అద్భతమైన విజయాలను చూశాం.. అదే జట్టు చతికిలపడ్డ సంఘటనలను చూసి ఆశ్చర్యపోయాం. తాజాగా టీమిండియా మహిళల జట్టు సైతం అలాంటి విచిత్ర విజయాన్ని సొంతం చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్ మహిళా జట్టుతో ఆదివారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో టీమిండియా మహిళా జట్టు కేవలం 50 పరుగులు చేసి...విండీస్‌ను 45 పరుగులకే కట్టడి చేసి అద్భుత విజయం సాధించింది.

Also Read:హర్మన్ ప్రీత్ స్టన్నింగ్ క్యాచ్: విండీస్ కెప్టెన్‌కు సెంచరీ మిస్

గయానాలో జరిగిన ఈ మ్యాచ్‌కు వరుణుడు పలుమార్లు ఆటంకం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను 9 ఓవర్లకే కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 50 పరుగులు మాత్రమే చేయగలిగింది. పూజా వస్త్రాకర్ మాత్రమే 10 పరుగులు చేసి పరువు నిలిపారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ మహిళల జట్టు 9 ఓవర్లలో 45 పరుగులు మాత్రమే చేసి పరాజయం మూటకట్టుకుంది. హేలీ మాథ్యూస్ 11, చినెల్లీ హెన్రీ 11, మెక్‌లీన్ 10 పరుగులు చేసినప్పటికీ భారత బౌలర్ల ముందు నిలబడలేకపోయారు.

Also Read:తమ్ముడు కొట్టిన షాట్‌.. అన్న ముక్కు పంక్చర్

టీమిండియా బౌలర్లలో అనుజా పటేల్ రెండు వికెట్లు, దీప్తి శర్మ, రాధా యాదవ్‌లు తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్‌లో టీమిండియా 4-0 ఆధిక్యంలో నిలిచింది. చివరి టీ20 బుధవారం జరగనుంది.