టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తన వ్యూహాలతో జట్టును ముందుండి నడిపించడంతో పాటు బ్యాటింగ్‌లోనూ ఇరగదీస్తుంది. ఈ క్రమంలో తాను ఫీల్డింగ్‌లోనూ అదరగొడతానని నిరూపించుకుంది హర్మన్ ప్రీత్.

వెస్టిండీస్ టూర్‌లో ఉన్న భారత్ ఆ జట్టుతో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. దీనిలో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో విండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్ కొట్టిన బంతిని లాంగ్ ఆన్ వద్ద అద్భుతంగా అందుకోవడంతో పాటు ఆమె సెంచరీని సైతం అడ్డుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ నష్టానికి 225 పరుగులు చేసింది. నటాషా మెక్‌లీన్ 51, చెడియాన్ నేషన్ 43తో రాణించారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ స్టెఫానీ భారత బౌలర్ ఏక్తా బిష్ వేసిన చివరి ఓవర్ ఐదో బంతిని సిక్స్‌గా కొట్టింది.

Also Read:కోహ్లీ లేకపోతే టీమిండియా బలహీనమా..? బంగ్లాదేశ్ కెప్టెన్

అప్పటికే 94 పరుగులు పూర్తి చేసుకోవడం, మరో బంతి మాత్రమే మిగిలి ఉండటంతో చివరి బంతిని కూడా సిక్స్‌గా మలిచేందుకు స్టెఫానీ ప్రయత్నించింది. బిష్ వేసిన చివరి బంతిని భారీ షాట్ కొట్టగా అక్కడే ఉన్న హర్మన్ ప్రీత్ గాల్లోకి జంప్ చేసి బంతిని ఒడిసి పట్టుకుంది.

దీంతో టేలర్ సెంచరీ చేసే అవకాశం చేజారిపోయింది. ఈ పరిణామంతో విండీస్ అభిమానులు నిరాశకు గురయ్యారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఓపెనర్లు ప్రియా పూనియా 75, రోడ్రిగ్స్ 41, పూనమ్ రౌత్ 22, మిథాలీ రాజ్ 20‌లు పోరాడినప్పటికీ భారత్‌కు ఓటమి తప్పలేదు. అయితే హర్మన్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది మ్యాచ్‌కే హైలట్‌గా నిలిచింది. 

Also Read:రోహిత్, జడేజాల మధ్య ఫుట్‌బాల్ స్టార్ ‘‘జ్లటాన్’’: కొంచెం జాగ్రత్తగా చూస్తే

టీమిండియా యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా ని ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ టీజ్ చేస్తోంది. వెన్ను నొప్పితో  బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. కాగా... ఇప్పుడిప్పుడే బుమ్రా వెన్నుగాయం నుంచి కోలుకుంటున్నాడు. జిమ్ లో మెల్లమెల్లగా కసరత్తులు ప్రారంభించాడు.

త్వరలోనే తాను మళ్లీ మైదానంలోకి వచ్చేస్తాను అంటూ ఇటీవల బుమ్రా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టాడు.  జిమ్ లో కసరత్తులు చేస్తూ... తీసుకున్న సెల్ఫీని కూడా సోషల్ మీడియాలో పెట్టాడు. కాగా... ఆ ఫోటోకి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేనియల్ వ్యాట్ స్పందించింది.

‘బేబీ వెయిట్స్’( చిన్నపిల్లలు ఎత్తగల తక్కువ బరువు ఉన్నవి) అంటూ కామెంట్స్ చేసింది. తక్కువ బరువులు ఎత్తుతున్నావు అనే అర్థం వచ్చేలా కామెంట్ చేసి టీజ్ చేసింది. ఎందుకంటే గాయం నుంచి కోలుకుంటున్న అతను ప్రస్తుతం తక్కువ వెయిట్స్ తో కసరత్తులు చేస్తున్నాడు