Asianet News TeluguAsianet News Telugu

తమ్ముడు కొట్టిన షాట్‌.. అన్న ముక్కు పంక్చర్

తమ్ముడు కొట్టిన షాట్‌కు అన్న గాయపడిన సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మార్ష్ వన్డే కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్టన్ అగర్.. తమ్ముడు వెస్ అగర్ షాట్‌ను క్యాచ్ పట్టుకునే క్రమంలో గాయపడ్డాడు. 

ashton agar suffers gruesome injury after dropping own brother catch in wes marsh cup
Author
Melbourne VIC, First Published Nov 18, 2019, 3:40 PM IST

తమ్ముడు కొట్టిన షాట్‌కు అన్న గాయపడిన సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మార్ష్ వన్డే కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్టన్ అగర్.. తమ్ముడు వెస్ అగర్ షాట్‌ను క్యాచ్ పట్టుకునే క్రమంలో గాయపడ్డాడు.

సౌత్ ఆస్ట్రేలియా తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఆగర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇదే సమయంలో 41వ ఓవర్‌లో మార్కస్ స్టోయినిస్ వేసిన బంతిని అతను మిడ్ వికెట్ మీదుగా షాట్ కొట్టగా అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఆస్టన్ దానిని అందుకోవడానికి యత్నించాడు.

Also Read:బంగ్లాతో రెండో టెస్ట్.. ఈడెన్ హౌస్‌ఫుల్: విరాట్ కోహ్లీని గ్రేట్ అన్న గంగూలీ

క్రమంలో బంతి కాస్త జారడంతో కనుబొమ్మల మధ్య నుదిటి భాగంలో తగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో రక్తంతో తడిసిన ముఖంతో ఆగర్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని విడిచి వెళ్లిపోయాడు. గాయం కారణంగా అతను టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ప్రమాదం ఏమి లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గాయమైన చోట కుట్లు వేయాలని డాక్టర్లు సూచించడంతో అందుకు అగర్ నిరాకరించి.. ప్లాస్టిక్ సర్జన్‌ను ఆశ్రయిస్తానని పేర్కొన్నాడు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న కారణంగానే ఆస్టన్ కుట్లు వద్దన్నాడని తెలుస్తోంది.

Also Read:గంభీర్ ని కడుపుబ్బా నవ్వించిన లక్ష్మణ్

తన సోదరుడికి జరిగిన గాయంపై వెస్ అగర్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. తన వల్లే ఇలా జరగడం బాధాకరమన్నాడు. ఆస్టన్ ఆరోగ్యం గురించి కలత చెందుతున్నానని.. అతనికి గాయమైన వెంటనే క్రీజును వదిలి హుటాహుటీన ఆస్టన్ దగ్గరికి వెళ్లి పరామర్శించానని పేర్కొన్నాడు.

అతనిని పరీక్షించిన వైద్యులు పెద్ద ప్రమాదమేమి లేదని చెప్పడంతో ఎంతో ఉపశమనం పొందానని అగర్ వెల్లడించాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios