న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో విజయం సాధించడంతో టీమిండియాలో మంచి జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలో క్రికెటర్ జెమియా రోడ్రిగ్స్ ఆఫ్ డ్యూటీ సెక్యూరిటీ గార్డుతో చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణా మండలి (ఐసీసీ) ఈ వీడియోను సోషల్ మీడియా పేజీలో ఉంచింది. సెక్యూరిటీ గార్డుతో కలిసి కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్ జంటగా నటించిన లవ్ ఆజ్ కల్ చిత్రంలో  ‘హాన్ మెయిన్ గలాట్’ పాటకు డ్యాన్స్ చేశారు. వారి స్టెప్పులు, పాట బీట్‌కు తగ్గట్టు లయబద్ధంగా సాగింది.

Also Read:పిచ్ రోలర్ డ్రైవ్ చేస్తూ ఎంఎస్ ధోనీ: వీడియో వైరల్

దీనిపై స్పందించిన హీరో కార్తీక్ ఆర్యన్ ఈ వీడియోను తన టైమ్‌లైన్‌లో పంచుకున్నాడు. ‘‘ తన అభిమాన క్రికెటర్ హాన్ మెయిన్ గలాట్ పాటకు డ్యాన్స్ చేశారని చెబుతూ.. ప్రపంచకప్‌తో స్వదేశానికి తిరిగి రావాల్సిందిగా ఆకాంక్షించాడు.

పనిలో పనిగా జెమియాతో స్టెప్పులేసిన సెక్యూరిటీ గార్డును కూడా బాలీవుడ్‌కు తీసుకురావాల్సిందిగా కార్తీక్ కామెంట్ చేశాడు. కాగా 2018 ఫిబ్రవరిలో టీమిండియా తరపున దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో జెమియా ఆరంగేట్రం చేసింది. వచ్చి రెండేళ్లు కూడా కాలేదు.. కానీ ఇప్పటికే ఎంతో పరిణితి చెందింది.

Also Read:కోహ్లీ బ్యాటింగ్ ఫట్: కివీస్ బౌలర్ల ఉచ్చులో ప్రతిసారీ ఇలాగే....

ఆమె క్రీజులో ఉందంటే జట్టుకు కొండంత బలం. క్లిష్ట సమయాల్లో నిలకడగా, ఎంతో బాధ్యతాయుతంగా ఆడుతూ... అందరి మన్ననలను పొందిన ఆమె తాజాగా టీ20 ప్రపంచకప్‌లోనూ అద్భుతంగా ఆడుతోంది. కాగా గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో విజయం సాధించి నేరుగా సెమీస్‌కు చేరిన సంగతి తెలిసిందే.