రోహిత్, విరాట్ కోసం గౌతమ్ గంభీర్ కోరిక.. !
Team India : టీ20 ప్రపంచ కప్, జింబాబ్వే సిరీస్ ల తర్వాత టీమిండియా ఇప్పుడు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలోనే సీనియర్లతో కూడిన జట్టు శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ లను ఆడనుంది. హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ కు ఇది తొలి సిరీస్.
Team India : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం వెస్టిండీస్ లో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2024 తో ముగిసింది. జట్టును ప్రపంచ ఛాంపియన్ గా నిలబెట్టిన ద్రవిడ్ స్థానంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ను భారత జట్టు ప్రధాన కోచ్ గా నియమించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). ఐసీసీ మెగా టోర్నీ ముగిసిన వెంటనే యంగ్ ప్లేయర్లతో టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. శుభ్ మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు 4-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది.
ఇప్పుడు భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్ లో టీ20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ ఆడనుంది. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్ గా ఇది టీమిండియా మొదటి షెడ్యూల్. విజయవంతమైన ప్లేయర్, కెప్టెన్, మెంటర్ గా గుర్తింపు సాధించిన గంభీర్ పై బీసీసీఐ భారీగానే అంచనాలు పెట్టుకుంది. దీనికి తగ్గట్టుగానే జట్టు విషయంలో గంభీర్ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సమాచారం. టీ20 ప్రపంచ కప్ తర్వాత జింబాబ్వే పర్యటనకు సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతినిచ్చారు. ఇప్పుడు శ్రీలంక సిరీస్ లో వీరిని ఆడించాలని గంభీర్ భావిస్తున్నారు.
టెస్టు క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు వీరే
ఈ క్రమంలోనే యంగ్ ప్లేయర్లతో పాటు సీనియర్లను జట్టులో ఉండాల్సిందిగా సూచనలు పంపారు. టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత సీనియర్ స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు. రాబోయే టీమిండియా సిరీస్ లలో వీరికి విశ్రాంతి ఇవ్వవచ్చుననే రిపోర్టులకు భిన్నంగా గంభీర్ వన్డే సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లను తీసుకురావడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఎందుకంటే భారత జట్టుకు ఈ సిరీస్ తర్వాత మరో సుదీర్ఘ విరామం లభిస్తుంది. సీనియర్ ప్లేయర్లు జట్టులో ఉండటం అనుకూల ఫలితాలు అందిస్తుందని కూడా భావిస్తున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలోనే శ్రీలంక వన్డే సిరీస్ కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రాలతో పాటు రవీంద్ర జడేజాలు ఆడాలని గంభీర్ కోరినట్టు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా, శ్రీలంక - భారత్ సిరీస్ జూలై 27న టీ20 మ్యాచ్ లతో ప్రారంభమవుతుంది. వన్డే సిరీస్ ఆగస్టు 2 నుండి మొదలకానుంది. చివరి వన్డే మ్యాచ్ ఆగస్ట్ 7న జరుగుతుంది. దీని తర్వాత సెప్టెంబర్ 19న చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టులో భారత జట్టు మళ్లీ గ్రౌండ్ లోకి దిగడానికి 6 వారాల గ్యాప్ ఉండనుంది.
ఒకే ఓవర్‌లో 41 పరుగులు.. ఇదెక్కడి క్రికెట్ మామా.. !