ఒకే ఓవర్‌లో 41 పరుగులు.. ఇదెక్కడి క్రికెట్ మామా.. !
cricket records : క్రికెట్ లో ఇప్పటివరకు ఇలాంటి దృశ్యం ఎప్పుడూ కనిపించలేదు. దాదాపు గెలిచిన మ్యాచ్ ను ఓడిపోయింది. ఒకే ఓవర్ లో 41 పరుగులు వచ్చాయి. ఇది మిమ్మల్ని షాక్ తో పాటు ఆశ్చర్యానికి గురిచేసినా ఇదే జరిగింది.. !
cricket records : క్రికెట్ గురించి చెప్పాలంటే మ్యాచ్‌లో చివరి బాల్ వరకు మ్యాచ్ ఫలితం చెప్పలేము. గెలిచే మ్యాచ్ ను ఓడిపోవడం.. ఓడిపోయే మ్యాచ్ ను గెలిచిన సందర్భాలు చాలా సార్లు జరిగాయి. కానీ, క్రికెట్ హిస్టరీలో ఇప్పటివరకు జరగని విధంగా మ్యాచ్ సాగింది. ఇది చూస్తే మీరు షాక్ తో పాటు ఆశ్చర్యపోతారు... ఎందుకంటే ఒకే ఓవర్ లో 41 పరుగులు వచ్చాయి. ఇది క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు. ఒక జట్టు గెలవడానికి చివరి రెండు ఓవర్లలో 61 పరుగులు కావాలి.. అయితే, ఒక బంతి మిగిలి ఉండగానే ఆ పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ సంచలనం ఆస్ట్రియా-రోమేనియా మ్యాచ్ లో కనిపించింది.
యూరోపియన్ క్రికెట్ ఇంటర్నేషనల్ టీ10లో జూలై 14న ఆస్ట్రియా vs రొమేనియా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో జరిగిన ఘటనలు క్రికెట్ హిస్టరీలో నిలిచిపోతాయి. ఎందుకంటే.. బుకారెస్ట్‌లో జరిగిన మ్యాచ్‌లో రొమేనియా 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఏకంగా 167 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రియా 8 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. చివరి రెండు ఓవర్లలో విజయానికి 61 పరుగులు కావాలి. గెలవడం కష్టమే కానీ, ఏవరూ ఊహించని విధంగా ఆ జట్టు విజయాన్ని అందుకుంది. కెప్టెన్ ఆకిబ్ ఇక్బాల్ 9 బంతుల్లో 22 పరుగులతో, ఇమ్రాన్ ఆసిఫ్ 9 బంతుల్లో 14 పరుగులతో ఆడుతున్నారు. చివరి రెండు ఓవర్లలో 61 పరుగులు చేయాల్సిన సమయంలో మన్మీత్ కోలీ బౌలింగ్ చేయడానికి వచ్చాడు.
6 6 6 6 6 4.. మరోసారి యువరాజ్ సింగ్ సునామీ ఇన్నింగ్స్..
తన ఓవర్ తో క్రికెట్ చరిత్రలో రికార్డు పరుగులు సమర్పించుకున్నాడు. 9వ ఓవర్లో మొత్తం 41 పరుగులు ఇచ్చాడు. దీంతో ఒక ఓవర్ లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా చెత్త రికార్డు నమోదుచేశాడు. కోలీ 9వ ఓవర్‌ను వైడ్, నో బాల్స్ తో కలిపి మొత్తం 10 బంతుల్లో పూర్తి చేశాడు. ఇమ్రాన్ ఆసిఫ్ తొలి బంతికి సింగిల్ తీశాడు, ఆ తర్వాత వైడ్ బాల్‌లో ఫోర్, తర్వాతి బంతికి సిక్సర్, ఇలా ఈ ఓవర్‌లో రెండు బంతుల్లో 12 పరుగులు వచ్చాయి. మళ్లీ తర్వాతి బంతికి ఫోర్, తర్వాత సిక్స్. దీంతో బౌలర్ ఒత్తిడిలోకి జారుకున్నాడు. తర్వాతి బంతి నో బాల్ వేయడంతో దానిని సిక్సర్ కొట్టాడు బ్యాటర్. తర్వాత డాట్ బాల్, ఆ తర్వాత నో బాల్‌లో సిక్స్, ఆపై వైడ్ బాల్‌లో ఇంకో రన్, ఆ తర్వాత చివరి బంతికి ఫోర్. ఈ విధంగా కోలీ ఓవర్ 1, 5WD, 6, 4, 6, 7NB, 0, 7NB, 1WD, 4 తో భారీగా పరుగులు ఇచ్చాడు. దీంతో ఆస్ట్రియా 9.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 173 పరుగులతో విజయాన్ని అందుకుంది.
టెస్టు క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు వీరే