క్రికెటర్ కేదార్ జాదవ్‌పై టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెటైర్లు వేశాడు. బ్యాట్‌ పట్టుకుని క్రికెట్ గ్రౌండ్‌లో పోజిస్తూ జాదవ్ దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన హిట్ మ్యాన్ పోజు కొట్టడం ఆపి.. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలంటూ కామెంట్ చేశాడు.

ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా.. భారత క్రికెట్ జట్టులో ఎప్పుడో అరంగేట్రం చేసిన కేదార్ జాదవ్ అడపా దడపా మెరుపులు తప్పించి పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు.

Also Read:ధోనీ అంటూ అరవకండి: పంత్ పై విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు

సౌతాంప్టన్‌లో ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగులు మినహా పెద్దగా రాణించలేదు. దీంతో సెలక్టర్లు అతనిపై వేటు వేశారు. వన్డే కెరీర్‌లో ఇప్పటి వరకు రెండు సెంచరీలు, 6 అర్థశతకాల్ని మాత్రమే జాదవ్ సాధించాడు.

Also Read:ధోనీ రికార్డుపై కన్నేసిన పంత్

అంతర్జాతీయ టీ20లలో 20.33 సగటుతో 122 పరుగులు చేసిన జాదవ్‌ ఇప్పుడు జాతీయ జట్టులో స్థానం కోసం ఎంతో ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో జాదవ్ కేవలం హాఫ్ సెంచరీ తప్పించి పెద్దగా రాణించలేదు. ఈ క్రమంలోనే జాదవ్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా రోహిత్ శర్మ అతనికి సున్నితంగా చురకలంటించాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Feels good to be back on the field and do what I like to do. 🏏🙂 #ranjitrophy @sareen_sports

A post shared by Kedar Jadhav (@kedarjadhavofficial) on Dec 3, 2019 at 10:25pm PST