టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డుపై పంత్ కన్నేశాడు. ధోనీ వారసుడిగా... పంత్ జట్టులోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ తర్వాత ధోనీ స్థానంలో పంత్ ఆడుతున్నాడు. అయితే.. పంత్  మాత్రం తన ఆటతో ఎవరినీ ఆకట్టుకోలేకపోయాడు.

ఈ సంగతి పక్కనపెడితే..  ఇప్పుడు పంత్... ధోనీ రికార్డును బ్రేక్ చేయనున్నాడు. హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం టీమిండియా వెస్టిండీస్ తో తలపడనున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ మ్యాచ్ లో కూడా ధోనీకి చోటు దక్కలేదు. అయితే... ఇరు జ ట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన టీ20 ఫార్మాట్ క్రికెట్ లో ధోనీ అత్యధికంగా ఏడు మ్యాచుల్లో ఐదుగురిని ఔట్ చేర్చి ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.

కాగా.. ఇప్పుడు ఈ రికార్డును అధిగమించే అవకాశం పంత్ కి దక్కింది. పంత్ ఇప్పటివరకు విండీస్ పై టీ 20ల్లో ముగ్గురిని  ఔట్ చేసి ఐదో స్థానంలో ఉన్నాడు. అలాగే విండీస్ మాజీ కీపర్లు, దినేశ్ రామ్ దిన్ ఐదుగురిని పెవిలియన్ చేర్చి నాలుగో స్థానంలో ఉన్నాడు.

AlsoReadబుమ్రా బేబీ బౌలర్...పాక్ మాజీ క్రికెటర్ సెటైర్లు, ఏకిపారేస్తున్ననెటిజన్లు...

ఈ నేపథ్యంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే సిరీస్ లో పంత్ మరో ముగ్గురిని బోల్తా కొట్టిస్తే ఈ  జాబితాలో అందరికన్నా ముందున్న ధోనీని అధిగమించే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా... టీమిండియా ఇటీవల వరస విజయాలతో దూసుకుపోతోంది. మరి.. విండీస్ తో మ్యాచ్ ఎలా ఆడతారో చూడాలి. ఇప్పటికే విండీస్ టీం కూడా సిరీస్ గెలిచేందుకు కసరత్తులు  చేస్తోంది.