ఐపీఎల్‌కు ముందు టీమిండియా కీలక సిరీస్‌కు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు సంబంధించి 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. మార్చి 12 నుంచి 18వ తేదీ వరకు ఈ సిరీస్ జరగనుంది.

Also Read:మహిళల టీ20 ప్రపంచకప్: ఫైనల్‌లో భారత్ చిత్తు చిత్తు, ఐదోసారి విశ్వవిజేతగా ఆసీస్

గాయంతో బాధపడుతున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు సెలక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. అలాగే కొద్దిరోజులుగా జట్టుకు దూరంగా ఉన్న విధ్వంసక ఆటగాడు హార్డిక్ పాండ్యా టీమిండియాలోకి పునరాగమనం చేశాడు.

Also Read:ధోని ఈజ్ బ్యాక్: 5 బంతుల్లో 5 సిక్సులు... వీడియో వైరల్

రోహిత్ గైర్హజరీతో ధావన్-పృథ్వీషా ఓపెనింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. పేసర్ మహ్మద్ షమీకి విశ్రాంతినివ్వగా.. వెటరన్ ఆటగాడు కేదార్ జాదవ్‌ను సెలక్టర్లు పక్కనబెట్టారు. 

భారత జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్)
శిఖర్ ధావన్
పృథ్వీషా
కేఎల్ రాహుల్
మనీష్ పాండే
శ్రేయస్ అయ్యర్
రిషబ్ పంత్
హర్డిక్ పాండ్యా
రవీంద్ర జడేజా
భువనేశ్వర్
చాహల్
జస్ప్రీత్ బుమ్రా
సంజయ్ 
కుల్‌దీప్ యాదవ్
శుభమన్ గిల్