Asianet News Telugu

మహిళల టీ20 ప్రపంచకప్: ఫైనల్‌లో భారత్ చిత్తు చిత్తు, ఐదోసారి విశ్వవిజేతగా ఆసీస్

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుని కోట్లాది మంది అభిమానులను నిరాశకు గురిచేసింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన భారత్ 19.1 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటయ్యింది. తద్వారా ఆస్ట్రేలియా 5వ సారి టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. సమిష్టి కృషితో తమకు సొంతగడ్డపై తిరుగులేదని ఆసీస్ నిరూపించింది. 

Womens t20 world cup INDvs AUS final: Live Updates...
Author
Melbourne VIC, First Published Mar 8, 2020, 12:02 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుని కోట్లాది మంది అభిమానులను నిరాశకు గురిచేసింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన భారత్ 19.1 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటయ్యింది. తద్వారా ఆస్ట్రేలియా 5వ సారి టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.

సమిష్టి కృషితో తమకు సొంతగడ్డపై తిరుగులేదని ఆసీస్ నిరూపించింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో దీప్తీ శర్మ 33, వేదా కృష్ణమూర్తి 19, రీచా ఘోష్ 18 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మేఘన్ స్కౌట్ 4, జెస్ జొనాసెన్ 3, డెలీసా, క్యారీ, సోఫీ తలో వికెట్ పడగొట్టారు. 

18వ ఓవర్‌లో జొనాసెన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన రాధా (1) మూన్ చేతికి చిక్కింది. మరో రెండు పరుగుల తర్వాత చివరి ఓవర్‌లో స్కౌట్ బౌలింగ్‌లో పూనమ్ పాండే (1) గార్డ్నర్‌కు క్చాచ్ ఇచ్చి ఔటవ్వడంతో భారత్ కథ ముగిసింది. 

ఆ వెంటనే మరో నాలుగు పరుగుల తర్వాత శిఖా పాండే ఒక్క పరుగుకే స్కౌట్ బౌలింగ్‌లో మూనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యింది. మరో 4 పరుగుల తర్వాత 18 పరుగులు చేసిన రిచా ఘోష్‌ సైతం స్కౌట్ బౌలింగ్‌లో క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. 

Also Read:మహిళల ప్రపంచ కప్ ఫైనల్ : భారత్ ఆశలన్నీ వీరిపైనే...!

కొద్దిసేపు ధాటిగా ఆడిన దీప్తి 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కేరీ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి మూనీ చేతికి చిక్కింది. దీంతో భారత్ 88 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది 

దీప్తి శర్మ, వేదా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నప్పటికీ జట్టు స్కోరు 58 పరుగుల వద్ద డెలిసా వేసిన 11.3 వ బంతికి వేదా 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జొనాసెన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యింది. 

భారత్‌కు పెద్ద షాక్ తగిలింది. జట్టు స్కోరు 30 పరుగుల వద్ద ఉండగా 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ జొనాసెన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి గార్డ్నర్‌ చేతికి చిక్కింది. పవర్ ప్లేలోనే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 

భారత ఆశలన్నీ స్మృతి మందనపైన్నే పెట్టుకున్న అభిమానులకు షాక్ తగిలింది. రెండు వరుస ఫోరులు కొట్టి జోరుమీదున్న ఆమెను సోఫీ అవుట్ చేసింది. ఇక హర్మాన్ ప్రీత్ పైన్నే భారత్ ఆశలు పెట్టుకుంది. ఇక ఆమె కూడా విఫలమైతే... భారత్ లో భారీ హిట్టర్లు ఎవరు లేరు. 

ఇక అంతకుముందు షెఫాలీ వర్మ అవుట్ అయిన తరువాత క్రీజులోకి వచ్చిన తానియా భాటియా తలకు బంతి బలంగా తగలడంతో ఆమె మైదానాన్ని వీడింది. భాటియా స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ డక్ అవుట్ గా వెనుదిరిగింది. . 

185 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు తొలి ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. భారత టీన్ ఏజ్ సంచలనం షఫాలు వర్మ కేవలం రెండు పరుగులు మాత్రమే సాధించి కీపర్ హేలీ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్ మేగన్ షూట్ ఈ వికెట్ ను సాధించింది. 

ఇక అంతకుముందు భారత బౌలర్లను ఆస్ట్రేలియా క్రికెటర్లు చీల్చి చెండాడారు. వారు ఏ ఒక్క బౌలేరని కూడా కనికరించకుండా ఉతికి ఆరేశారు. ఓపెనర్లు బెత్ మూని, హేలీలు అద్భుతంగా వికెట్ సమర్పించకుండా 10 ఓవర్లపాటు చుక్కలు చూపెట్టారు. 

Also Read:టి20 ప్రపంచ కప్ ఫైనల్ : భారత పవర్ ప్లే వ్యూహం, ఆసీస్ భయమదే!

బెత్ మూనీ సపోర్ట్ తో రెచ్చి పోయిన హేలీ కేవలం 39 బంతుల్లోనే 75 పరుగులు పిండుకుంది. వారు సింహస్వప్నాలుగా భారత బౌలర్లపై కనికరం లేకుండా గ్రౌండ్ కి అన్ని వైపులా షాట్లు ఆడారు. 

హేలీ నిష్క్రమించిన తరువాత ఎవరు ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. మెగా లనింగ్ మాత్రమే రెండంకెల స్కోర్ చేసింది. హెలి నిష్క్రమించిన తరువాత బెత్ మూని గేర్లు మార్చింది. చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచి భారత్ ముందు 184 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. 

భారత బౌలర్లను చీల్చి చెండాడడమే ధ్యేయంగా  ఆస్ట్రేలియా ఆడారు.

భారత బౌలేర్లేవ్వరిని వదలపైనా వారు ఆడేస్తున్నారు. పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండడంతో భారత బ్యాట్స్ ఉమెన్ కూడా దుమ్ము దులుపుతారని, దులపాలని అభిమానులు కోరుకుంటున్నారు.

భారత్‌ ఇక్కడ రెండు మ్యాచులు (న్యూజిలాండ్‌, శ్రీలంక) ఆడింది. ఒత్తిడితో కూడిన టైటిల్‌ పోరులో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం లేదు!. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం ఎక్కువని ఇదివరకే చెప్పడం జరిగింది. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు భారత మహిళల జట్టు, ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. అత్యంత ఆసక్తిగా సాగనున్న ఈ సిరీస్ లో ఇప్పటివరకు అజేయంగా నిలిచిన భారత్... నాలుగుసార్లు టైటిల్ విజేత, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఎదుర్కొంటుంది. 

ప్రపంచ మహిళల క్రికెట్‌లో తొలిసారి 90,000 మంది ఓ మ్యాచ్‌ను వీక్షించనున్నారు. ఈ అరుదైన, అద్భుత మెల్బోర్న్ వేదికపై భారత్‌, ఆస్ట్రేలియాలు 2020 మహిళల ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ కోసం అంతిమ సమరానికి సిద్ధమయ్యాయి. 

గ్రూప్‌ దశలో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన భారత్‌ అదే ఆత్మవిశ్వాసంతో నేడు మెగా ఫైనల్లో హాట్‌ ఫేవరెట్‌గా అడుగుపెడుతోంది. ప్రపంచకప్‌లు నెగ్గటం ఎలాగో తెలిసిన ఆస్ట్రేలియా సొంతగడ్డపై టైటిల్‌ను నిలుపుకునేందుకు సర్వ శక్తులూ వడ్డనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios