సచిన్ టెండూల్కర్ డీప్‌ఫేక్ వీడియో.. ఎఫ్‌ఐఆర్ న‌మోదు.. !

Tendulkar Deepfake Video: భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆన్‌లైన్ గేమ్‌ను ప్రమోట్ చేస్తున్న డీప్‌ఫేక్ సోష‌ల్ మీడియాలో క‌నిపించ‌డంపై ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. తప్పుడు సమాచారంపై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పేర్కొన్నారు. స‌చిన్ డీప్ ఫేర్ వీడియోపై ముంబైలో ఎఫ్ఐఆర్ న‌మోదైంది.
 

Team India legendary cricketer Sachin Tendulkar deepfake video.. FIR registered in Mumbai RMA

Sachin Tendulkar Deepfake: ప్ర‌ముఖుల‌ డీప్‌ఫేక్  వీడియోలు క‌ల‌కలం రేపుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీలకు సంబంధించిన‌ డీప్‌ఫేక్ వీడియోలు వైర‌ల్ గా మారిన నేప‌థ్యంలో చాలా మంది ఈ టెక్నాల‌జీ దుర్వినియోగంపై ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. తాజాగా క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ కూడా డీప్ ఫేక్ బారిన‌ప‌డ్డాడు. టెండూల్క‌ర్ ఒక గేమింగ్ యాప్ ను ప్ర‌మోట్ చేస్తున్న‌ట్టుగా ప్ర‌స్తుతం నెట్టింట ఒక డీప్ ఫేక్ వీడియో వైర‌ల్ అవుతోంది. అందులో యాప్ తో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని చెబుతూనే.. త‌న కుమార్తె సారా టెండూల్కర్ కూడా దీని నుంచి డ‌బ్బులు సంపాదిస్తున్న‌ద‌ని చెబుతున్న‌ట్టుగా ఉంది.

ఈ మార్ఫింగ్ వీడియో పై సంచిన్ ఆందోళ‌న వ్యక్తంచేశారు. ఈ న‌కిలీ వీడియోను ఫ్లాగ్ చేసిన టెండూల్క‌ర్.. ఇలాంటివాటిపై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌నీ, తప్పుడు సమాచారం వ్యాప్తికి వ్యతిరేకంగా అప్రమత్తత, వేగవంతమైన చర్యల అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ క్ర‌మంలోనే డీప్ ఫేక్ వీడియో గురించి ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ, రాజీవ్ చంద్రశేఖర్, మహారాష్ట్ర సైబర్ బ్రాంచ్ తో పాటు కీలకమైన అధికారులను టెండూల్కర్ ట్యాగ్ చేశారు. దీనిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. టెక్నాల‌జీ దుర్వినియోగం ఆందోళ‌న క‌లిగించే విషయంగా పేర్కొన్నారు.

టీ20 ప్రపంచకప్ ఆడే 10 మంది ఆటగాళ్లు ఫైనల్.. రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే.. !

స‌చిన్ డీప్ ఫేక్ వీడియోపై కేసు న‌మోదు

నెట్టింట స‌చిన్ టెండూల్క‌ర్ వీడియో వైర‌ల్ కావ‌డంతో రంగంలోకి దిగిన ముంబై పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. సచిన్ టెండూల్కర్ పీఏ రమేష్ పర్ధే ఫిర్యాదు మేరకు ముంబై సైబర్ సెల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందనీ, ఐపీసీ సెక్షన్ 500, ఐటీ చట్టంలోని సెక్షన్ 66 (ఏ) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స‌చిన్ డీప్ ఫేక్ వీడియాలో ప్ర‌చారం చేసిన గేమిగ్ యాప్, దాని య‌జ‌మానిపై ముంబై పోలీసులు కేసు న‌మోదుచేసిన‌ట్టు వెల్ల‌డించారు. సంబంధిత పోర్ట‌ల్, దాని య‌జ‌మానిపై ప‌రువు న‌ష్టంతో పాటు ఐటీ చ‌ట్టంలోని ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదుచేశారు. ఈ గేమింగ్ యాప్ స‌ర్వ‌ర్లు విదేశాల్లో ఉన్నాయ‌ని స‌మాచారం.

 

షోయబ్ మాలిక్ తో డివోర్స్ కన్ఫార్మ్.. ! పెళ్లి, విడాకుల పై సానియా మీర్జా పోస్ట్ వైర‌ల్ !

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios