క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తన చిన్ననాటి మిత్రుడు, భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి సవాల్ విసిరాడు. ఇదేదో సీరియస్ ఛాలెంజ్ కాదు.. సరదా కోసమే. 2017లో ప్రముఖ నేపథ్య గాయకుడు సోను నిగమ్‌ సచిన్‌తో కలిసి క్రికెట్ వాలీ బీట్‌ పాటను పాడారు.

Also Read:మ్యాచ్‌ మధ్యలో మరో అమ్మాయిపై ముద్దుల వర్షం : భార్యను మోసం చేశానంటూ పోస్ట్

ఈ సాంగ్ అప్పట్లో యువత నోళ్లలో నానడంతో పాటు నెట్టింట్లో విపరీతంగా షేర్ అయ్యింది. ఇందులో గతేడాది వన్డే ప్రపంచకప్‌లో పాల్గొన్న భారత క్రికెటర్ల పేర్లను సచిన్ ర్యాప్ చేశాడు. ఈ క్రమంలో జనవరి 18న కాంబ్లీ పుట్టినరోజు సందర్భంగా అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు.

అలాగే చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో వినోద్ కాంబ్లీ మంచి సింగర్ అని.. అంతకంటే మంచి డ్యాన్సర్‌ అంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. తాజాగా తాను పాడిన క్రికెట్ వాలీ బీట్‌ పాటను పాడాలని అందుకు ఒక వారం మాత్రమే గడువు విధించారు.

Also Read:చితక్కొట్టిన కేశవ్ మహరాజ్: ఇంగ్లాండు కెప్టెన్ జో రూట్ చెత్త రికార్డు

ఒకవేళ కాంబ్లీ కనుక జనవరి 28లోపు పాట పాడలేకపోతే తనకు రుణపడి ఉంటాడని ట్వీట్ చేశాడు. దీనికి బదులిచ్చిన వినోద్ కాంబ్లీ ఇది పెద్ద సవాలే అంటూ రీట్వీట్ చేశాడు. చిన్నతనంలో సచిన్, కాంబ్లీలు ప్రముఖ క్రికెట్ గురువు రమాకాంత్ ఆచ్రేకర్ వద్ద క్రికెట్ శిక్షణ తీసుకున్నారు. వీరిద్దరు కలిసి తమ పాఠశాల తరపున 664 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ప్రపంచ రికార్డు సృష్టించారు.