ఈక్వెడార్‌లో ఇటీవల బార్సిలోనా, డెల్ఫిన్‌ల మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ‘‘కిస్ కామ్‌’’లో పట్టుబడిన వ్యక్తి దీనిపై సోషల్ మీడియాలో స్పందించాడు. తాను తన జీవిత భాగస్వామిని మోసం చేస్తున్నట్లు అంగీకరించాడు.

యూకేలోని మెట్రో వెబ్‌సైట్ ప్రచురించిన కథనం ప్రకారం ఈ వ్యక్తిని దేవి ఆండ్రేడ్‌గా గుర్తించారు. ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా గ్యాలరీలో ఆండ్రేడ్ తన పక్కనవున్న అమ్మాయిని ముద్దు పెట్టుకోవడాన్ని కెమెరాలు క్లిక్‌మనిపించాయి.

Also Read:చితక్కొట్టిన కేశవ్ మహరాజ్: ఇంగ్లాండు కెప్టెన్ జో రూట్ చెత్త రికార్డు

ఇది పెద్ద తెరపైనా మరియు ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్‌లలో ప్రత్యక్ష ప్రసారం అవుతోందని తెలుసుకుని నాలుక కరచుకున్నాడు. వెంటనే ఆ యువతికి దూరంగా జరిగాడు. ఈ క్రమంలో సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టిన ఆండ్రేడ్ తాను జీవిత భాగస్వామిని మోసం చేసినట్లు అంగీరించి, ఆమె తిరిగి తన జీవితంలోకి రావాల్సిందిగా కోరాడు.

తన జీవితంలోని మనోహరమైన క్షణాలను తిరిగి పొందాలని అనుకుంటున్నానని, ఈ అర్థంలేని విషయంపై వ్యాఖ్యానించేందుకే తాను సోషల్ మీడియా ముందుకు వచ్చానని ఆండ్రేడ్ పోస్ట్ చేశాడు.

అలాగే ఫేస్‌బుక్‌లో పెట్టిన మరో పోస్ట్‌లో నెటిజన్లు తనకు కలిగించిన మానసిక క్షోభ నుంచి కోలుకోవడానికి బలాన్ని ప్రసాదించాల్సిందిగా దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపాడు. తాను చివరి వరకు మనిషిగా తన గౌరవాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నానని.. తనను చర్చికి ఆహ్వానించిన వారికి ఆండ్రేడ్ ధన్యవాదాలు తెలిపాడు.

Also Read:న్యూజిలాండ్ తో టీ20 సిరీస్... ధావన్ స్థానంలో ఎవరు..?

తన ప్రతిష్టను ఎవరు పాడు చేయలేరని, భగవంతుడు గొప్పవాడని తనను విమర్శిస్తున్న ఈ మహిళలకు కూడా తనకు మోసం జరిగిందన్న విషయం తెలుసునని అయినప్పటికీ ఇంకా విమర్శిస్తున్నారని ఆండ్రేడ్ మండిపడ్డాడు.

మీరు ఇప్పటిదాకా తన సంబంధాన్ని నాశనం చేశారని.. ఇంకా ఏం కావాలని అతను ప్రశ్నించాడు. కాగా ఆండ్రేడ్ ఆ యువతిని ముద్దు పెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.