క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌కు ఆయన కుమారుడు సమిత్ ద్రావిడ్ ఒక రోజు ముందే పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చాడు. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 8 వరకు బెంగళూరులో జరగనున్న సౌత్ జోన్ అండర్-14 టోర్నమెంట్‌ (రెండు రోజుల వ్యవధి మ్యాచ్‌లు) కోసం కర్ణాటక రాష్ట్ర అండర్-14 జట్టులో సమిత్ ద్రావిడ్ స్థానం సంపాదించాడు.

Also Read:వన్డేలకు ధోనీ గుడ్ బై: తేల్చేసిన రవిశాస్త్రి, టీ20లపై ఇలా..

శుక్రవారం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ జట్టును ప్రకటించింది. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన సమిత్ సెలక్షన్ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేశాడు. కేఎస్‌సీఏ ఇంటర్ జోనల్ అండర్-14 టోర్నమెంట్‌లో సమిత్ ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ (201)తో పాటు 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఈ టోర్నమెంట్‌లో పాల్గొనడం ద్వారా సమిత్‌కు ఇది మొట్టమొదటి రాష్ట్ర స్థాయి టోర్ని. సమిత్ ఎంపికవ్వడంతో రాహుల్ ద్రావిడ్ హర్షం వ్యక్తం చేశాడు. మిస్టర్ డిపెండబుల్ శనివారం తన 47వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఆయన ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

Also Read:ఓపెనర్స్ బిగ్ ఫైట్: రాహుల్, ధావన్ లలో నిలిచేదెవరు...?

మరోవైపు హోలీ సెయింట్ హైస్కూలుకు చెందిన కేపీ. కార్తీకేయ కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. సమిత్ ద్రావిడ్ మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అండర్-14 జట్టుకు కర్ణాటక మాజీ రంజీ క్రికెటర్లు సి.రఘు, రాజశేఖర్ షన్‌బాల్‌లు కోచ్‌లుగా వ్యవహరిస్తారు. 

కర్ణాటక అండర్-14 జట్టు: కేపీ కార్తీకేయ (కెప్టెన్), శివం ఎంబీ, సమిత్ ద్రవిడ్, రోహన్ ఆర్ రేవంకర్, రవి కైరవ్ రెడ్డి (వికెట్ కీపర్), సమర్థ్ నాగరాజ్, కనిష్క్ ఎమ్ (వికెట్ కీపర్), రాహుల్ బెల్లాడ్, అన్ష్ ఐమా, ప్రణవ్ అశ్వత్, హర్దిక్ రాజ్, శ్రీధర్ జే, ప్రణవ్ అభిజిత్ భట్ ఏడీ, ఆదర్శ్ ఉర్స్, ఆర్యన్ ఇంచల్,