ఓపెనర్స్ బిగ్ ఫైట్: రాహుల్, ధావన్ లలో నిలిచేదెవరు...?
వచ్చేనెలలో ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్ పోలో నాలుగు అంతర్జాతీయ ఆవిష్కరణలతోపాటు 14 వాణిజ్య, 12 ప్రయాణికుల వాహనాలను ప్రదర్శిస్తామని టాటా మోటార్స్ అధ్యక్షుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రాజేంద్ర పెట్కర్ తెలిపారు.
త్రోడౌన్ నిపుణుడు నువాన్ లెఫ్టార్మ్ బంతులను ధావన్ ఎడమ చేతి శైలి బ్యాటింగ్‌తో కొట్టడంతో అభిమానుల అల్లరి రెట్టింపు అయ్యింది. ఇదే సమయంలో మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ సైతం మైదానంలోకి ప్రవేశించాడు. ధావన్ ఎడమ చేతి వాటం శైలి షాట్‌ను, తను కుడి చేతివాటం శైలిలో ఆడేశాడు. ఓ వైపు ధావన్, మరో వైపు రాహుల్ షోతో అభిమానుల ఉత్సాహం జోరందుకుంది.
ప్రాక్టీస్ సెషన్లోనే ఇలా ఉంటే, అసలు పోరులో మరింత చూపిస్తారనే అంచనాలు అభిమానుల్లో పెరిగిపోయాయి. చిరుజల్లుల వర్షం, చిల్లుల కవర్లు గౌహతి టీ20ని ముంచేయగా, అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి.
సీన్ కట్ చేస్తే ఇండోర్‌లో రెండో టీ20. రాహుల్, ధావన్ మధ్య డైరెక్ట్ షుటౌట్ తొలి రౌండ్‌కు వేదిక. రాహుల్ తొలి బంతి నుంచీ ఎదురుదాడి చేయగా, ధావన్ కుదురుకునేందుకు సమయం తీసుకున్నాడు. రాహుల్ 32 బంతుల్లో 6 బౌండరీలతో 45 పరుగులు చేయగా... ధావన్ 29 బంతుల్లో 2 ఫోర్లతో 32 పరుగులు చేశాడు.
ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్, గాయం నుంచి కోలుకున్న శిఖర్ ధావన్ మధ్య ముఖాముఖి ఓపెనర్ రేసు అభిమానుల్లో విపరీత ఆసక్తి రేపుతోంది. వైస్ కెప్టెన్, రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే సిరీస్‌కు తిరిగి వచ్చే సమయానికల్లా ఈ విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
శిఖర్ ధావన్ వరుస గాయాలు రాహుల్‌కు వరమయ్యాయి. వెస్టిండీస్‌తో మూడు టీ20, మూడు వన్డేల్లో ఓపెనర్‌గా రాహుల్ విశేషంగా ఆకట్టుకున్నాడు. 61, 11, 91, 6, 102, 77 పరుగుల ఇన్నింగ్స్‌తో ఓపెనర్ స్థానానికి తాను కూడా ఒక బలమైన అభ్యర్థినని ఒక సందేశం పంపాడు. ముంబయిలో టీ20 నిర్ణయాత్మక పోరులో 56 బంతుల్లో 91 పరుగుల ఇన్నింగ్స్, తప్పక నెగ్గాల్సిన విశాఖ వన్డేలో 102 పరుగుల శతకం రాహుల్ తనేంటో చూపించాడు.
తొలి బంతి నుంచే ఎదురుదాడి చేయాల్సిన పరిస్థితిలో, ఆచి తూచి ఆడుతూ, అవసరం వచ్చినప్పుడు చెలరేగాల్సిన సందర్భంలో రాహుల్ సత్తా చాటాడు. జట్టు మేనేజ్‌మెంట్ నుంచి రాహుల్‌కు మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. బలవంతంగా రాహుల్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడించే ప్రయత్నం చేయమని కెప్టెన్ విరాట్ కోహ్లి 2017లో పేర్కొన్నాడు. కానీ 2018 నిదాహస్ ట్రోఫీలో రాహుల్ మిడిల్ ఆర్డర్‌లోనే ఆడాల్సి వచ్చింది. 2019 వరల్డ్‌కప్‌లోనూ మిడిల్ ఆర్డర్‌లోనే అవకాశాలు లభించాయి.
శిఖర్ ధావన్ గాయంతో జట్టుకు దూరమైన తర్వాతే టాప్ ఆర్డర్‌లో రాహుల్‌కు స్థానం లభించింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్ క్రికెట్‌లో దేశవాళీ, అంతర్జాతీయ సర్క్యూట్లలో నిలకడైన ప్రదర్శనతో రాహుల్ ఒక రకంగా దమ్ముంటే తనను విస్మరించండనే సవాల్ విసిరాడు. ?
టాప్ ఆర్డర్‌లో శిఖర్ ధావన్ విలువ ప్రత్యేకం. వరుస గాయాలు 2019లో ధావన్ ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపించాయి. కానీ 2018 టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా గబ్బర్ నిలిచాడు. 17 ఇన్నింగ్స్‌ల్లో 147.22 స్ట్రయిక్‌రేట్‌తో 689 పరుగులు చేశాడు. ప్రపంచ బ్యాట్స్‌మెన్‌లో మరే ఇతర బ్యాట్స్‌మన్ ధావన్ దరిదాపుల్లో కూడా లేరు!.
ఐపీఎల్ 12లో ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పరుగులు చేయటం కష్టసాధ్యమైన ఫిరోజ్ షా కోట్ల పిచ్‌పై 130.38 స్ట్రయిక్ రేట్‌తో ఏడు ఇన్నింగ్స్‌ల్లోనే 236 పరుగులు చేశాడు. ముగ్గురు ఓపెనర్ల స్ట్రయిక్‌రేట్‌లో మాత్రం రాహుల్ (127.58) కాస్త ముందున్నాడు. శిఖర్ ధావన్ 123.84 స్ట్రయిక్‌రేట్‌తో రాహుల్ తర్వాతే ఉన్నాడు. రోహిత్ శర్మ 109.91 స్ట్రయిక్‌రేట్‌తో 776 పరుగులు చేశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన సందర్భాల్లో భారీ లక్ష్యాలను నిర్దేశించేటప్పుడు భారత్ తడబడుతోంది. గత సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో బెంగళూర్‌లో జరిగిన టీ20లో ధావన్ బాధ్యత తీసుకున్నాడు. ఎన్నడూ లేని విధంగా ముందు నుంచీ తనే ఎదురుదాడి చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో చాలా రిస్క్‌లు చేశాడు. షంషి బౌలింగ్‌లో వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కానీ, ఈ విధ్వంసం ఎంతోసేపు నిలువలేదు.
2019 వరల్డ్‌కప్‌కు ముందు ధావన్ ఫామ్ అంతగా బాలేదు. కానీ ఆస్ట్రేలియాపై అద్భుత సెంచరీతో ధావన్ వరల్డ్‌కప్‌ను ఘనంగా మొదలెట్టాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్లను ఎదుర్కొవటంలో శిఖర్ ధావన్ బలహీనత అందరికీ తెలిసిందే.
లెగ్ స్టంప్‌కు ఆవల నిలబడి, కొన్నిసార్లు అవుట్‌సైడ్ క్రీజులోకి వచ్చి ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్‌లను ధావన్ ఎదుర్కొన్నాడు. తెలివిగా స్టార్క్, కమిన్స్ లను ఎదుర్కొన్న ధావన్.. మిగతా బౌలర్లపై దండెత్తావాడు. ఐసీసీ టోర్నీల్లో ధావన్ మెరుపులకు పరిచయం అక్కర్లేదు. కానీ 2020 టీ20 వరల్డ్‌కప్ రేసులో కెఎల్ రాహుల్ ముందున్నాడు. ఐసీసీ టోర్నీల్లో గొప్ప రికార్డు, అనుభవం కలిగిన ధావన్, సూపర్ ఫామ్‌లో ఉన్న రాహుల్‌లను ఇప్పటికిప్పుడు వేరు చేయలేం.
శ్రీలంకతో రెండు టీ20, ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఈ ఇద్దరిలో ఒకరిని ఎంచుకునేందుకు సరిపోవు. రానున్న న్యూజిలాండ్ పర్యటనలో ఇద్దరి ప్రదర్శన చూసిన తర్వాత ధావన్, రాహుల్‌లలో ఎవరితో 2020 టీ20 వరల్డ్‌కప్‌లో వెళ్లాలో నిర్ణయించుకోవాలి. అప్పటివరకూ టాప్ ఆర్డర్‌లో ఓపెనర్ బెర్త్ కోసం రాహుల్, ధావన్ ముఖాముఖి పరుగుల రేసు అభిమానులకు మాత్రం మంచి పసందైన విందు!.