కరోనా లాక్‌డౌన్: తల్లిసేవలో జస్ప్రీత్ బుమ్రా, రెండుసార్లు ఫ్లోర్ క్లీనింగ్
లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. భార్యాపిల్లలు, ఇతర కుటుంబసభ్యులతో గడుపుతూ లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు
లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. భార్యాపిల్లలు, ఇతర కుటుంబసభ్యులతో గడుపుతూ లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
భారత క్రికెటర్లు సైతం ప్రస్తుతం షెడ్యూల్ ఏం లేకపోవడంతో కుటుంబంతో గడుపుతున్నారు. రోజుకొక క్రికెటర్‌కు సంబంధించిన వీడియో, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న బీసీసీఐ తాజాగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వీడియోను షేర్ చేసింది.
Also Read:టోక్యో ఒలింపిక్స్ రీషెడ్యూల్: కొత్త తేదీలు ఇవే
బుమ్రా తన ఇంటిని శుభ్రపరుస్తూ తన తల్లికి సాయం చేస్తున్నారు. ఒకే ఫ్లోర్‌ను బుమ్రా రెండు సార్లు శుభ్రం చేయాల్సి వచ్చింది. తన పనుల వల్ల తల్లి సంతోషంగా ఉందని బుమ్రా ట్వీట్ చేశాడు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి మార్చి 25 నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కోవిడ్ 19 కారణంగా 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేయడానికి ముందే దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్ రద్దయిన సంగతి తెలిసిందే.
Also Read:కరోనా మాయ... నో సెలూన్, ఎవరి జుట్టు వాళ్లే..
కరోనా వైరస్‌తో పోరాడటానికి, దేశ ప్రజల్లో అవగాహన కల్పించడానికి పలువురు క్రికెటర్లు ముందుకు వస్తున్నారు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో 50 లక్షల విరాళం ప్రకటించింది. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, అజింక్య రహానే, సురేశ్ రైనా విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.