347 పరుగుల భారీ స్కోరు చేసి కూడా న్యూజిలాండ్ చేతిలో దారుణ ఓటమిని మూటకట్టుకున్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఏకంగా 80 శాత కోత విధించింది.

Also Read:కివీస్ విజయంలో కీలకపాత్ర: మన బుమ్రానేనా అంటున్న ఫ్యాన్స్

ఐసీసీ నిర్దేశించిన షెడ్యూల్ కంటే నాలుగు ఓవర్లు ఆలస్యంగా వేసినందుకు గాను ఒక్కో ఓవర్‌కు 20 శాతం చొప్పున టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో రిఫరీ క్రిస్ బ్రాడ్ కోత విధించారు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ... నాలుగు, ఐదో మ్యాచ్‌లలో కూడా కోహ్లీ సేనకు 20 శాతం జరిమానా పడిన సంగతి తెలిసిందే.

కాగా హామిల్టన్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్‌పై కివీస్ 4 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. టీమిండియా నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ మరో 11 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. రాస్ టేలర్ 109 నాటౌట్‌ ధాటిగా ఆడి జట్టుకు విజయాన్ని అందించి.. వరుస ఓటములకు బ్రేక్ వేశాడు. 

Also Read:దాదాను వెనక్కినెట్టిసిన కోహ్లీ: నెక్ట్స్ టార్గెట్ ధోనీయే

భారత ఓటమిపై స్పందించిన విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ లోపాలతో మ్యాచ్‌ను చేజార్చుకున్నామన్నాడు. టామ్ లేథన్, రాస్ టేలర్‌లు బాగా ఆడారని కోహ్లీ ప్రశంసించాడు.